Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాల రాముని దివ్యాశిస్సులతో అరి సినిమాలో సూర్య పురిమెట్ల లుక్

Advertiesment
Surya Purimetla's look,  Ari

డీవీ

, సోమవారం, 22 జనవరి 2024 (17:45 IST)
Surya Purimetla's look, Ari
వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అరి’. 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. "పేపర్ బాయ్" ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
 
‘అరి’ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంగా బాల రాముని దివ్యాశిస్సులతో ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించిన సూర్య పురిమెట్ల క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేశారు. సూర్య పురిమెట్ల క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ‘అరి’ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది. ‘అరి’ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. ‘అరి’ సినిమా హిందీ రీమేక్ పై బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ‘అరి’ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా మూవీ టీమ్ అనౌన్స్ చేయనుంది.
 
నటీనటులు - వినోద్ వర్మ , సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, అక్షయా శెట్టి, రిధిమా పండిట్, పి.అనిల్ కుమార్, నవీనా రెడ్డి, తమిళ బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్, బ్యాంకు శ్రీనివాస్, సమీర్, మాణిక్ రెడ్డి, రాజ్ తిరందాస్, గాయత్రి భార్గవి, మీనా కుమారి, లావణ్య రెడ్డి, ఇంటూరి వాసు, జబర్దస్త్ సద్దాం, నీలా ప్రియ, యోగి ఖత్రి తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోధ్య ప్రాణ్ ప్రతిష్ఠ: హనుమాన్ గర్హిలో శుభ్రత పనుల్లో కంగనా రనౌత్