Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరో సూర్య, ద‌ర్శ‌కుడు బాల కాంబినేషన్‌లో ప్రారంభ‌మైన సూర్య41 చిత్రం

Advertiesment
హీరో సూర్య, ద‌ర్శ‌కుడు బాల కాంబినేషన్‌లో  ప్రారంభ‌మైన సూర్య41 చిత్రం
, సోమవారం, 28 మార్చి 2022 (16:45 IST)
Suriya-Bala new movie poster
ప్రస్తుతం విభిన్న కథ లతో శరవేగంగా దూసుకుపోతున్న హీరో సూర్య 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన డైరెక్టర్ బాలతో కలిసి పని చేయనున్నారు. వీరు ఇరువురు కలిసి చేసిన చివరి చిత్రం 'శివపుత్రుడు' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడం, ఈ చిత్రంలో సూర్య పాత్రకి తెలుగు ,తమిళంలో  మంచి పేరు రావడం తో ప్రేక్షకులలో ఈ కలయిక పై మరిన్ని అంచనాలు పెరగనున్నాయి.
 
ఈ చిత్రానికి  2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో సూర్య,  జ్యోతిక నిర్మాతలుగా , రాజేశేఖర పాండియన్ సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. "నా గురువు లాంటి వ్యక్తి బాల యాక్షన్ చెప్పడానికి వెయిట్ చేస్తున్నా, 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగింది మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి అని "హీరో సూర్య ట్వీట్ చేశారు.
 
సూర్యని సరికొత్తగా ఒక డిఫరెంట్ రోల్‌లో చూపించడానికి డైరెక్టర్ బాల ఒక యూనిక్, ఉద్వేగభరితమైన కథని సిద్ధం చేసారు. "సూర్య41" చిత్రం పూజ కార్యక్రమాలు నిర్వహించుకుని కన్యాకుమారిలో ఈ రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది.
 
మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ కృతి శెట్టి ఈ చిత్రం లో సూర్యకి జోడీగా నటించనుంది, సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు..బాల సుబ్రమణియం సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు.
 
న‌టీన‌టులు- సూర్య & కృతి శెట్టి
సాంకేతిక బృందం:
డైరెక్టర్ : బాల
బ్యానర్ : 2డి ఎంటర్టైన్మెంట్
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రాఫర్ : బాల సుబ్రమణియం
ఎడిటర్: సతీష్ సూర్య
ఆర్ట్ : మాయపండి
నిర్మాతలు : సూర్య, జ్యోతిక
సహా నిర్మాత : రాజేశేఖర పాండియన్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్మిక మందనకు Kids Choice Award 2022-శ్రీవల్లి హ్యాపీ హ్యాపీ