Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ సర్జరీలే శ్రీదేవిని బలి తీసుకున్నాయా? ఆరు నెలల్లో 20 సర్జరీలు?

సినీ తారలు అందానికి ప్రాధాన్యత ఇస్తారు. అందం వున్నంతవరకే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనే లాజిక్ వారికి బాగా తెలుసు కాబట్టి.. హీరోయిన్లు ఫిట్‌గా కనిపించడంతో పాటు తమ శరీరాకృతికి వన్నె తగ్గకుండా చూసేందుకు

ఆ సర్జరీలే శ్రీదేవిని బలి తీసుకున్నాయా? ఆరు నెలల్లో 20 సర్జరీలు?
, సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (12:23 IST)
సినీ తారలు అందానికి ప్రాధాన్యత ఇస్తారు. అందం వున్నంతవరకే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనే లాజిక్ వారికి బాగా తెలుసు కాబట్టి.. హీరోయిన్లు ఫిట్‌గా కనిపించడంతో పాటు తమ శరీరాకృతికి వన్నె తగ్గకుండా చూసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటారు. లావు పెరిగితే తగ్గించుకునేందుకు కూడా ఆపరేషన్లు చేసుకుంటారు. 
 
అయితే గతంలో లావుగా వున్న హీరోయిన్లు విదేశాల్లో శస్త్రచికిత్స చేసుకున్న దాఖలాలున్నాయి. కానీ ఈ ఆపరేషన్లు వికటించిన మరణాలకు దారితీసిన దాఖలాలూ వున్నాయి. ఇందుకు ఆర్తీ అగర్వాల్ మృతి కూడా ఓ ఉదాహరణ. పెళ్లైయ్యాక లావైన ఆర్తీ అగర్వాల్.. సినిమాల్లో నటించేందుకు లావు తగ్గాలని అమెరికాలో చికిత్స చేయించుకుంది. 
 
కానీ ఆ ఆపరేషన్ కాస్త వికటించి ప్రాణాలు కోల్పోయింది. ఇదే తరహాలో ఉన్నట్టుండి కార్డియా అటాక్‌తో ప్రాణాలు కోల్పోయిన శ్రీదేవి మరణానికి కూడా సర్జరీలే కారణమని నెట్టింట చర్చ జరుగుతోంది. శ్రీదేవి గతంలో పెదవులు, బ్రెస్ట్, ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని.. ఇటీవల ఆరు నెలల్లో 20 సర్జరీలు శ్రీదేవి చేయించుకున్నట్లు సమాచారం. ఈ సర్జరీల ఎఫెక్టే ఆమె హృదయంపై భారం మోపాయని వైద్యులు చెప్తున్నారు. 
 
ఇంకా సెలెబ్రిటీలు కెరీర్, ఆర్థికపరమైన ఒత్తిళ్లకు గురవుతుంటారు. ఈ ఒత్తిడి గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలా ఒత్తిడికి గురైనప్పుడు గుండె వేగం 120 నుంచి 150 సార్లకు పైగా కొట్టుకుంటుంది. గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్త ప్రసరణ వేగంగా సాగాల్సిన సమయంలో రక్త నాళాలు చిన్నవిగా కుంచించుకుపోతాయి. 
 
అప్పటివరకు రక్తనాళాల్లో బ్లాకులు లేకపోయినప్పటికీ ఒత్తిడి వల్ల అవి కుంచించుకుపోయి సడన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌కు కారణమవుతాయని వైద్యులు చెప్తున్నారు. ఒత్తిడి వల్లే శ్రీదేవి కూడా ప్రాణాలు కోల్పోయిందని.. తన కుమార్తె తొలి సినిమా గురించి ఆమె ఎక్కువగా ఆలోచించేదని సన్నిహిత వర్గాల సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెలెబ్రిటీలైనా.. సాధారణ పౌరుడైనా అక్కడ అంతా సమానమే...