Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెలెబ్రిటీలైనా.. సాధారణ పౌరుడైనా అక్కడ అంతా సమానమే...

అందాల తార శ్రీదేవి దుబాయ్‌లో శనివారం రాత్రి మరణించారు. కానీ, సోమవారం ఉదయం వరకు ఆమె పార్ధివదేహం స్వదేశానికి రాలేదు. దీనికి కారణం లేకపోలేదు. దుబాయ్ చట్టాల మేరకు ఆ దేశంలో సెలెబ్రిటీ చనిపోయినా, సాధారణ పౌర

Advertiesment
సెలెబ్రిటీలైనా.. సాధారణ పౌరుడైనా అక్కడ అంతా సమానమే...
, సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (11:55 IST)
అందాల తార శ్రీదేవి దుబాయ్‌లో శనివారం రాత్రి మరణించారు. కానీ, సోమవారం ఉదయం వరకు ఆమె పార్ధివదేహం స్వదేశానికి రాలేదు. దీనికి కారణం లేకపోలేదు. దుబాయ్ చట్టాల మేరకు ఆ దేశంలో సెలెబ్రిటీ చనిపోయినా, సాధారణ పౌరుడు చనిపోయినా అంతా సమానంగానే చూస్తారు. మరణం ఎలా సంభవించినా (ప్రమాదం, సహజ మరణం, అనుమానాస్పదం) పోలీసులకు విధిగా సమాచారం ఇవ్వాల్సిందే. 
 
అయితే, ఆస్పత్రుల్లో చనిపోతే మాత్రం ఆస్పత్రి వర్గాలే పోలీసులకు సమాచారం చేరవేస్తాయి. అదే బయట చనిపోతే 999 అనే నంబరుకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం చేరవేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు వచ్చి మరణ సమాచారాన్ని నమోదు చేసి మృతదేహాన్ని అల్ రాషేద్ లేదా అల్ ఖుసేన్ ఆస్పత్రుల్లోని మార్చురీలకు తరలిస్తారు. 
 
శ్రీదేవి శనివారం రాత్రి హోటల్ గదిలో చనిపోయింది. అంటే బయట చనిపోయినట్టే లెక్క. దీంతో విధిగా పోస్టుమార్టం చేస్తారు. ఆ రిపోర్ట్ రావటానికి 24 గంటల సమయం పడుతుంది. 25వ తేదీ ఆదివారం కావటంతో రిపోర్టులో జాప్యం జరిగింది. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత శ్రీదేవి మృతదేహాన్ని ఎంబాలింగ్ చేశారు. ఈ ప్రక్రియకు గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుంది. ఆ తర్వాత మాత్రమే డెత్ సర్టిఫికెట్ విడుదల చేశారు. అది పోలీసులకు అందుతుంది.
 
ఆ దేశ నిబంధనల మేరకు ప్రకారం డెత్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మాత్రమే భారత రాయబార కార్యాలయం శ్రీదేవి చనిపోయినట్టు ధృవీకరించి ఆమె పాస్‌పోర్టును రద్దు చేస్తుంది. పాస్ పోర్ట్ రద్దు చేసిన తర్వాత.. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుమతి తీసుకోవాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాత దుబాయ్ ఎంబసీ అధికారులు ప్రొసీజర్ కంప్లీట్ చేసి.. కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అందజేశారు. ఆ తర్వాతే ప్రత్యేక చార్టెడ్ విమానంలో ముంబైకి శ్రీదేవి మృతదేహాన్ని తలరించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'జామురాతిరి జాబిలమ్మ' హిట్‌సాంగ్స్