హీరో రాజ్తరుణ్, కొండా విజయ్ కుమార్‌ల సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `పవర్ ప్లే`. మహిదర్, దేవేష్ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్సాధిస్తోంది. ఈ సందర్భంగా నటుడు మధు నందన్ మాట్లాడుతూ - నా క్యారెక్టర్ కి మంచి అప్రిసియేషన్ వస్తోంది. ఇంతకు ముందు నేను చేసిన క్యారెక్టర్స్తో పోలిస్తే ఈ సినిమాలో నాది డిఫరెంట్ రోల్.ఇంత మంచి పాత్ర ఇచ్చిన విజయ్ గారికి థ్యాంక్స్. ఆడియన్స్‌కి సినిమా నచ్చింది``అన్నారు.
నటి పూజా రామచంద్రన్ మాట్లాడుతూ - ఈ కంటెంట్ ఒక రీ ప్రెషింగ్ చేంజ్ఆడియన్స్ తో కలిసి సినిమా చూశాను. చాలా ఎంగేజ్ చేసింది. నా పార్ట్ చాలా నచ్చింది` అన్నారు. హీరోయిన్ హేమల్ దేవ్ మాట్లాడుతూ- ``మీ అందరితో కలిసి ఈ మూవీ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. విజయ్ మంచి కంటెంట్ తో ఒక గొప్ప సినిమా తీశారు. రాజ్ కి ఇది ఒక మెమరబుల్ మూవీ. ఆండ్రూగారు నన్ను స్క్రీన్ మీద చాలా అందంగా చూపించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది`` అన్నారు.
దర్శకుడు విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ - `` పవర్ ప్లే ఫస్ట్ రోజు యావరేజ్ కలెక్షన్స్‌తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత రోజు నుండి ఆడియన్స్ మౌత్ టాక్, మీడియా పాజిటీవ్ రివ్యూస్ వల్ల డీసెంట్ కలెక్షన్స్ సాధిస్తోంది. సినిమా చూసిన ప్రతి వ్యక్తి ఒక మంచి సినిమా అని చెబుతున్నారు. ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే ఫస్ట్ టైమ్ రాజ్ ఒక కొత్త జోనర్ ట్రై చేశాడు. పూర్ణ ఇంతకు ముందెన్నడు చేయని ఒక క్యారెక్టర్ చేసింది. పూజా, దనరాజ్, భూపాల్, మధు ఇలా ప్రతి ఒక్కరూ తాము ఇంతకు ముందెన్నడు చేయని క్యారెక్టర్స్ ట్రై చేశారు. నేను ఒక కొత్త జోనర్‌లో చేశాను. మేమందరం కలిసి కొత్తగా చేసిన మా సినిమాని ఆదిరించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అన్నారు.
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ - ``లాక్‌డౌన్ తర్వాత వెంటనే మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఒరేయ్ బుజ్జిగా మూవీ రిలీజైంది. అది కంప్లీట్ ఎంటర్‌టైనర్. తర్వాత వెంటనే మేం అందరం కలిసి డిఫరెంట్ గా ట్రై చేద్దాం , ఆడియన్స్ ని ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇద్దాం అని ఈ సినిమా చేయడం జరిగింది. మా ఇన్ని నెలల కష్టానికి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు నిజంగా హ్యాపీగా ఉంది. మా సినిమాని ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్యూ వెరీ మచ్. ఫస్ట్ డే కలెక్షన్స్ తక్కువ వచ్చినా ఆడియన్స్ మౌత్ టాక్, మీడియా పాజిటీవ్ రివ్యూస్ వల్ల మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. చూసిన వాళ్లందరూ బాగుంది అంటున్నారు. ఎవరైనా చూడకపోతే థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి. రెండు గంటలపాటు మిమ్మల్ని కంప్లీట్ గా సీట్ ఎడ్జ్‌న కూర్చోబెడుతుంది`` అన్నారు.