Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'శ్రీమంతుడు' నందియాత్ర.. ఖాతాలో ఎనిమిది నందులు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. సరికొత్త కథ, కథనాలతో చిత్రాలు చేస్తూ అభిమానులను విశేషంగా ఆలరిస్తున్నాడు. ‘రాజకుమారుడు’తో వెండితెర కథానాయకుడిగా తొలిసారి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ఘట్టమనేని వారసుడు..

'శ్రీమంతుడు' నందియాత్ర.. ఖాతాలో ఎనిమిది నందులు
, బుధవారం, 15 నవంబరు 2017 (09:44 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. సరికొత్త కథ, కథనాలతో చిత్రాలు చేస్తూ అభిమానులను విశేషంగా ఆలరిస్తున్నాడు. ‘రాజకుమారుడు’తో వెండితెర కథానాయకుడిగా తొలిసారి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ఘట్టమనేని వారసుడు.. అరంగేట్ర చిత్రంతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ మంచి స్టార్‌డమ్‌‌ను సొంతం చేసుకున్నాడు.
 
తన తొలి చిత్రానికే ఉత్తమ అరంగేట్ర నటుడిగా 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ‘నంది’ పురస్కారాన్ని అందుకున్నాడు. తాజాగా ఈయనకు మరోసారి నందిపురస్కారం వరించింది. 2015 సంవత్సరానికి ఉత్తమ నటుడు (శ్రీమంతుడు) పురస్కారం ఆయనకు వరించింది. ఓ ఊరిని దత్తత తీసుకోవాలనే ఉన్నతమైన ఆశయంతో ‘శ్రీమంతుడు’ చిత్రం తెరకెక్కి విశేష ప్రేక్షకాదరణ పొందిన విషయం తెల్సిందే. తాజాగా ప్రకటించిన నంది పురస్కారంతో కలిపి మొత్తం ఎనిమిది నందులు మహేష్‌ ఖాతాలో చేరాయి.
 
మహేష్‌ ‘నంది’యాత్ర 2000 నుంచి 2006 వరకు కొనసాగింది. వీటిలో ఉత్తమ నటుడు, స్పెషల్‌ జ్యూరీ అవార్డులు ఉన్నాయి. తొలి చిత్రం ‘రాజకుమారుడు’తో మొదటి సారిగా నంది పురస్కారం అందుకున్న మహేష్‌కు.. 2002లో ‘మురారి’, 2003లో ‘టక్కరిదొంగ’, 2005లో ‘అర్జున్‌’ చిత్రాలకు స్పెషల్‌ జ్యూరీ కేటగిరీలో అవార్డులు వరించాయి. 2004లో ‘నిజం’, 2006లో ‘అతడు’, 2012లో ‘దూకుడు’ చిత్రాల్లో నటనకు ‘ఉత్తమ నటుడు’గా నంది అవార్డులకు ఎంపికయ్యారు. మహేష్‌కు వచ్చిన ఎనిమిది నంది అవార్డుల్లో నాలుగు ‘ఉత్తమ నటుడు’ పురస్కారాలే కావడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంపేస్తానంటున్నారు.. రక్షణ కల్పించండి : దర్శకుడు కేతిరెడ్డి