Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sundeep Kishan: సూపర్ సుబ్బు సిరీస్.. సెక్స్ ఎడ్యుకేషన్ ... సందీప్ కిషన్

Advertiesment
Super Subbu Series Team

చిత్రాసేన్

, సోమవారం, 13 అక్టోబరు 2025 (18:12 IST)
Super Subbu Series Team
సందీప్ కిషన్ హీరోగా రూపొందిన కొత్త ప్రాజెక్ట్ సూపర్ సుబ్బు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ 2026లో స్ట్రీమింగ్ కానుంది.

దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ.. సూపర్ సుబ్బు ఆలోచన ఒక అబ్జర్వేషన్ నుంచి పుట్టింది. ఈ రోజుకీ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మనం ఇంకా గుసగుసలలోనే మాట్లాడుతున్నాం. తల్లిదండ్రులు దాన్ని దాటవేస్తారు, పాఠశాలలు విస్మరిస్తాయి, పిల్లలు అపోహలతో పెరుగుతారు. ఆ మౌనాన్ని ఒక కథగా మార్చాలని అనిపించింది. సుబ్రహ్మణ్యం అనే పాత్ర ద్వారా అవగాహనను ఎలా కలుస్తుందో చూపించాలనుకున్నాం. మాఖీపూర్ ప్రజల, అపోహలు, ఆప్యాయత.. ఇవన్నీ మనందరికీ తెలిసిన గ్రామజీవనాన్ని గుర్తు చేస్తాయి.
 
నటి మిథిలా పాల్కర్ మాట్లాడుతూ.. సూపర్ సుబ్బు కామెడీ, భావోద్వేగాలు, కుటుంబ బంధాలు అన్నీ కలగలసిన కథ. సుబ్బు అనే దురదృష్టపు యువకుడు చిన్న పట్టణ వాస్తవాలతో, కఠినమైన తండ్రితో ఎలా పోరాడతాడో ఈ సిరీస్‌ చెబుతుంది. అతని ప్రయాణం ఒక గ్రామీణ నేపథ్యానికి చేరుతుంది, అక్కడ అతను అరుదుగా మాట్లాడే ఒక విషయాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ప్రేమ, ఆకాంక్షతో కూడిన ఈ కథ కొత్తదనం, హాస్యంతో నిండినదిగా ఉంటుంది. పాత్రలు చాలా దగ్గరగా అనిపిస్తాయి, కథ కూడా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ఇది నేను ఇప్పటివరకు చేసిన ప్రాజెక్టుల కంటే పూర్తిగా భిన్నమైనది.
 
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ..ఇప్పుడు మనం ఒక అందమైన కథా కాలంలో ఉన్నాం. కథలు మరింత ధైర్యంగా, భావోద్వేగంగా, మన జీవితాల్లో భాగంగా అనిపించేలా మారాయి. ‘సూపర్ సుబ్బు’ కథ విన్న వెంటనే ఇది చెప్పదగ్గ నిజమైన కథ అని నమ్మాను. ప్రేక్షకులు ఈ కథను ప్రేమిస్తారని అనిపించింది. పాత్రల ఉత్సాహం, రచనలోని హాస్యం..ఇవన్నీ సిరీస్‌ మొత్తాన్ని చిరునవ్వుతో నింపుతాయి.
తారాగణం: సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళి శర్మ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mamita Baiju: అందుకే డ్యూడ్‌.. నాకు ఒకేసారి సవాలుగా, ఉత్సాహంగా వుంది : మమిత బైజు