Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సన్నీలియోన్ హాట్ బయోపిక్ రానుందోచ్.. కింగ్ ఖాన్‌తో ఆ సాంగ్ కిక్కిస్తుందట..!

అందాల తార, పోర్న్ స్టార్ సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తోంది. తన అందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పటికే పరిశ్రమలో పలు వివాదాలు సైతం ఉన్నాయి. న

Advertiesment
Sunny Leone
, బుధవారం, 27 జులై 2016 (12:55 IST)
అందాల తార, పోర్న్ స్టార్ సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తోంది. తన అందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పటికే పరిశ్రమలో పలు వివాదాలు సైతం ఉన్నాయి. నటనలో తానేవ్వరికి తక్కువేమీ కాదని నిరూపించుకున్న ఈ ముద్దుగుమ్మ తన హాట్ జీవితగాథ ఆధారంగా ఓ సినిమా చేయాలనీ అనుకుంటుంది. 
 
ఈ సినిమాలో సన్నీలియోన్ పాత్రలో ఆమెనే నటిస్తుండడం విశేషం. ఈ సినిమాలో సన్నీ భర్త డేనియల్, అతని స్నేహితులు కూడా నటిస్తున్నారట. బాలీవుడ్‌లో ఆమె నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినా ఆమెకు క్రేజ్ తగ్గకపోవడం విశేషం. బాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ హవా కొనసాగిస్తోంది. ఇప్పటికే ధోనీ బయోపిక్ రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో.. సన్నీలియోన్ హాట్ బయోపిక్‌కు మంచి ఆదరణ లభించనుందని సినీ పండితులు అంటున్నారు.
 
ఇదిలా ఉంటే.. సన్నీ లియోన్ పోర్న్ స్టార్ ముద్ర నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరో సన్నీ లియోన్‌తో నటించాలని ఉందంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక షారూఖ్ ఖాన్ అయితే తన కొత్త సినిమా ''రయీస్‌" కోసం సన్నీతో ఓ ఐటెం సాంగ్‌ చేయించాడు. సన్నీ లియోన్ పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ లాంటి పెద్ద ఇండస్ట్రీకి వస్తానని ఆమె అసలు అనుకోలేదు. 
 
ఒకవేళ వచ్చినా ఇప్పుడున్నంత క్రేజ్ వస్తుందని ఊహించలేదు. అలాంటి సన్నీలియోన్‌కు బాలీవుడ్ బాద్ షాగా పేరొందిన షారుఖ్‌తో డ్యాన్స్ చేయడమంటే కల నిజమైనట్లే. స్టార్ హీరోయిన్స్ కూడా ఈ ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంటారు. ఆ సువర్ణావకాశం సన్నీకి రయీస్ సినిమా రూపంలో వచ్చింది. "రయీస్" మూవీలో ఒక స్పెషల్ సాంగ్ కోసం కింగ్ ఖాన్‌తో కలిసి కాలు కదిపింది సన్నీలియోన్. ఇందులో సన్నీలియోన్ గ్లామర్ డోస్ ఏ రేంజిలో ఉంటుందట. మొత్తం సినిమాకే ఈ సాంగ్ ఒక కిక్కివ్వనుందట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను వంట చేసేది సరిపోలేదా?