Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్చి 10న ప్రపంప వ్యాప్తంగా సందీప్‌ కిషన్‌ 'నగరం'

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా, రెజీనా కథానాయికగా అశ్వినీ కుమార్‌ సహదేవ్‌ సమర్పణలో ఎకెఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, పొటెన్షియల్‌ స్టూడియోస్‌ పతాకాలపై లోకేష్‌ దర్శకత్వంలో రూపొందిన వెరైటీ చిత్రం 'నగరం

Advertiesment
Sundeep Kishan's Nagaram
, సోమవారం, 6 మార్చి 2017 (10:40 IST)
యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా, రెజీనా కథానాయికగా అశ్వినీ కుమార్‌ సహదేవ్‌ సమర్పణలో ఎకెఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, పొటెన్షియల్‌ స్టూడియోస్‌ పతాకాలపై లోకేష్‌ దర్శకత్వంలో రూపొందిన వెరైటీ చిత్రం 'నగరం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. 
 
ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు అశ్వనీ కుమార్‌ సహదేవ్‌ మాట్లాడుతూ... ''ఒక నగరంలో 48 గంటల్లో నలుగురు వ్యక్తుల మధ్య జరిగే కథ ఇది. సందీప్‌ కిషన్‌ది ఒక స్టోరీ కాగా, రెజీనాది మరో స్టోరీ. శ్రీ అనే వ్యక్తిది ఇంకో స్టోరీ. ఈ మూడు స్టోరీలను కలుపుతూ ఒక డ్రైవర్‌ కథ వుంటుంది. ఈ నాలుగు కథలూ ప్యారలల్‌గా రన్‌ అవుతూ వుంటాయి. ఇది స్క్రీన్‌ప్లే బేస్డ్‌ మూవీ. స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా అనిపిస్తుంది. సినిమాలో సందీప్‌ కిషన్‌, రెజీనాలపై చిత్రీకరించిన ఒక మాంటేజ్‌ సాంగ్‌ సినిమాకి పెద్ద హైలైట్‌ అవుతుంది. 
 
రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలా కాకుండా ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన కమర్షియల్‌ మూవీ ఇది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌నిస్తుంది. సినిమా మీద మాకు చాలా కాన్ఫిడెన్స్‌ వుంది. శుక్రవారం రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాని బుధవారమే పాత్రికేయులకు షో వెయ్యాలనుకుంటున్నాం. సినిమా మీద మాకు అంత కాన్ఫిడెన్స్‌ వుంది. ఈ చిత్రాన్ని మార్చి 10న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. తప్పకుండా 'నగరం' మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు. సందీప్‌ కిషన్‌, రెజీనా జంటగా నటించిన చిత్రానికి జావేద్‌ రియాజ్‌, శశాంక్‌ వెన్నెలకంటి, సెల్వకుమార్‌ ఎస్‌కె., సతీష్‌కుమార్‌, ఫిలోమిన్‌ రాజు పనిచేసిన సాంకేతిక వర్గం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుటుంబాలు బంధాలు, అనుబంధాల నేపథ్యంలో 'ఆనందం అంబరమైతే'