Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుటుంబాలు బంధాలు, అనుబంధాల నేపథ్యంలో 'ఆనందం అంబరమైతే'

ఎస్బీ మూవీస్ బ్యానర్‌పై బుద్దాల సత్యనారాయణ నిర్మాణ సారథ్యంలో సుబ్బు ఈరంకి రచన, దర్శకత్వంలో "ఆనందం అంబరమైతే" సినిమా మోషన్ పోస్టర్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మీ ఘనంగా ఆవిష్కరించారు.

కుటుంబాలు బంధాలు, అనుబంధాల నేపథ్యంలో 'ఆనందం అంబరమైతే'
, సోమవారం, 6 మార్చి 2017 (10:31 IST)
ఎస్బీ మూవీస్ బ్యానర్‌పై బుద్దాల సత్యనారాయణ నిర్మాణ సారథ్యంలో సుబ్బు ఈరంకి రచన, దర్శకత్వంలో "ఆనందం అంబరమైతే" సినిమా మోషన్ పోస్టర్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మీ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు సుబ్బు మాట్లాడుతూ ఈ చిత్రం అన్ని తరగతుల ప్రేక్షకులకు నచ్చేవిధంగా సకుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా నిర్మిస్తున్నామన్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఫ్యామిలీ, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ మిళితమై ఉంటుందన్నారు. 20 సంవత్సరాల క్రితం కుటుంబాలలో బంధాలు, అనుబంధాలు ఎలా ఉండేవో కళ్ళకు కట్టినట్లు ఉంటుందని, కన్న తల్లి, ఉన్న ఊరుకు... ఉన్న ప్రాధాన్యతను తెలిపే విధంగా ఈ ఆనందం అంబరమైతే సినిమా ఉంటుందన్నారు. 
 
ఈ సినిమాలో ఆరు పాటలకు అద్భుతంగా సంగీతాన్ని కాకినాడకు చెందిన శ్రీకృష్ణ అందించడం ఆనందదాయకంగా ఉందన్నారు. అనంతరం నిర్మాత బుద్దాల సత్యనారాయణ మాట్లాడుతూ... ఈ సినిమా కథకు హీరో‌గా అనిపించి అందరూ కొత్తవాళ్ళతో నిర్మాణాన్ని చేపట్టామన్నారు. చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలైన డబ్బింగ్, ఎడిటింగ్ వంటి కార్యక్రమాలకు అనువుగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో అత్యాధునిక టెక్నాలజీతో డబ్బింగ్ థియేటర్ నిర్మించడం జరిగిందని ఈ సినిమాను అక్కడే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడం జరిగిందన్నారు. 
 
అనంతరం ఎస్‌బి మూవీస్ లోగో ఆవిష్కరణ ప్రముఖ గాయిని పెద్దాడ సూర్యకుమారి ఆవిష్కరించారు. ప్రముఖ కథ రచయిత రాధిక రచించిన పాటను కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చేతుల మీదుగా ఆనందం అంబరమైతే సినిమా టైటిల్‌గా ఆవిష్కరించారు. అనంతరం కన్నబాబు మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాలో ప్రకృతి అందాలతో కనువిందుగా కనిపించే పరిసరప్రాంతాలలో ఈ చిత్రాన్ని నిర్మించడం ఆనందదాయకమన్నారు. ఈ సినిమాలో కథానాయకుడుగా ఆర్‌కే, కథానాయికగా అవంతిక ప్రధాన పాత్రలలో సురేష్, కాకినాడ నాని, మధు, మాష్టర్ చిలకచర్ల కిషోర్ చంద్ర, మాష్టర్ బుద్దాల కృష్ణ చైతన్య నాయుడు, భాను, నాగలక్ష్మిలు నటిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో సాయిరామ్ శంకర్ "నేనోరకం" .. మార్చి 17న రిలీజ్