Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీరో సాయిరామ్ శంకర్ "నేనోరకం" .. మార్చి 17న రిలీజ్

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'నేనోరకం'. చిత్రీకరణ పూర్తి చేసుకొంది. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీధర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్

హీరో సాయిరామ్ శంకర్
, సోమవారం, 6 మార్చి 2017 (10:11 IST)
సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'నేనోరకం'. చిత్రీకరణ పూర్తి చేసుకొంది. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీధర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహిత్ నారాయణ్ కంపోజ్ చేసిన ఈ సినిమా పాటలను పూరి జగన్నాథ్, దేవిశ్రీ ప్రసాద్, గోపిచంద్, శర్వానంద్ ఒక్కొక్కరిగా ఒక్కొక్క పాటను త్వరలో ఆవిష్కరించబోతున్నారు. మార్చి 17న సినిమా విడుదలకు సిద్దమవుతోంది. 
 
ఈ సందర్భంగా సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ.. 'నేనోరకం' అనే టైటిల్ మా ఈ సినిమాకు కరెక్ట్‌గా యాప్ట్. ఆడియెన్స్‌ను అలరించటంతోపాటు, ఆలోచింపజేసేలా, కాంటెంపరరీ ఇష్యూస్‌ను స్ఫూర్తిగా తీసుకొని, ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబడిన చిత్రమిదన్నారు.
 
శరత్ కుమార్ మాట్లాడుతూ గత కొంతకాలంగా సౌత్‌లో అందులోనూ తెలుగు సినీ పరిశ్రమ నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి. 'నేనోరకం' సైతం అదే కోవలో వస్తున్న ట్రెండీ మూవీ. దర్శకుడి కథ, కథనమే ఈ సినిమాకు హైలెట్. సినిమా టీమ్ అందరికి ఈ సినిమా మంచి పేరును తీసుకువస్తుందన్నారు.
 
దర్శకుడు సుదర్శన్ మాట్లాడుతూ మహిత్ అందించిన పాటలను టాప్ సెలబ్రెటీస్ త్వరలో ఆవిష్కరించబోతున్నారు. "నేనోరకం" టైటిల్‌కు తగ్గట్టుగానే సరికొత్త ట్రీట్‌మెంట్‌తో సినిమా రూపొందించటం జరిగింది. సాయిరామ్ శంకర్ - శరత్ కుమార్‌ల నటన, వారిద్దరి మధ్య వచ్చె సన్నివేశాలు ఆడియెన్స్‌కు సరికొత్త థ్రిల్‌ను కలుగచేస్తాయన్నారు.
 
నిర్మాత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మా సంస్థ ద్వారా వస్తొన్న తొలి చిత్రన్నే ఓ సరికొత్త కమర్షియల్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఆడియోన్స్‌తో పాటు, క్రిటిక్స్‌ను కూడా అలరించేలా ఈ సినిమాను సిద్ధం చేయటం జరిగింది. మార్చి 17న సినిమా విడుదలవుతుందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇలాంటి ఆలోచనలు ఉన్నవారిని ప్రోత్సహిస్తూనే ఉంటాను... తమ్మారెడ్డి