Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీలో చేరనున్న సినీ నటి సుమలత

Sumalatha
, శుక్రవారం, 10 మార్చి 2023 (08:13 IST)
సీనియర్ నటి సుమలత భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయంపై కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సంకేతాలు ఇచ్చారు. ఆమె భర్త, సీనియర్ నటుడు అంబరీశ్ కాంగ్రెస్ పార్టీ. ఆయన మరణంతో మాండ్య లోక్‌సభ స్థానం నుంచి సుమలత పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేటాయించలేదు. దీంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆమె ప్రస్తుతం బీజేపీలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
తొలుత ఈ వార్తలు ఊహాగానాలే అంటూ ప్రతి ఒక్కరూ కొట్టిపారేశారు. కానీ, కర్నాటక ముఖ్యమంత్రి బాసవరాజ్ బొమ్మై చేసిన వ్యాఖ్యలతో ఆమె బీజేపీలో చేరడం ఖాయమని తేలిపోయింది. ఇదే విషయంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సుమలత బీజేపీలో చేరే విషయంపై సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, తాను బీజేపీలో చేరబోతున్నట్టు సాగుతున్న ప్రచారంపై శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో ఓ క్లారిటీ ఇవ్వనున్నారు. వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోడీ కర్నాటక రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆ పర్యటనలో ఆమె ప్రధాని మోడీ సమక్షంలో పార్టీలో చేరవచ్చని తెలుస్తుంది. 
 
ప్రధాని మోడీ మాండ్యా నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో సుమలత కూడా హాజరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాగా, దక్షిణాదిన పలు భాషా చిత్రాల్లో నటించిన సుమలత.. ప్రేక్షకుల మనస్సుల్లో మంచి స్థానం ఉంది. అలాంటి పాపులర్ నటి బీజేపీలో చేరితే మాండ్యా జిల్లాలో ఆ పార్టీకి గట్టిపట్టు దొరికినట్టేనని రాజీయ విశ్లేషలకు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిర్భయ స్క్వాడ్‌.. మహిళా అధికారులకు శిల్పాశెట్టి సన్మానం