Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుధీర్ బాబు జటాధర నుంచి ఫస్ట్ ట్రాక్ సోల్ అఫ్ జటాధర రిలీజ్

Advertiesment
First track from Jatadhara Soul

చిత్రాసేన్

, గురువారం, 25 సెప్టెంబరు 2025 (18:32 IST)
First track from Jatadhara Soul
సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది.
 
ఇటివల రిలీజ్ అయిన టీజర్ నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యింది. ఈ విజువల్ స్పెక్టకిల్ జటాధర నవంబర్ 7, 2025న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.  మేకర్స్ తాజాగా మేకర్స్ ఫస్ట్ ట్రాక్ 'సోల్ ఆఫ్ జటాధార'ను రిలీజ్ చేశారు.  
 
‘సోల్ ఆఫ్ జటాధర’ సినిమా ప్రిమైజ్ ని అద్భుతంగా సెట్ చేసింది. సాంప్రదాయ సంగీతం, డివైన్ టచ్ కలిపిన ఈ స్వరాలు మనల్ని జటాధర ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. బీట్‌లు చాలా ఇంటెన్స్‌గా ఉండి, సినిమా టోన్‌తో  పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. “ఓం నమఃశివాయ” జపం గూస్ బంప్స్ తెప్పించింది.
 
సోల్ ఆఫ్ జటాధర’తో ప్రమోషన్స్‌కి ఇప్పుడు కంప్లీట్ జోష్ కంపొచ్చింది. రాజీవ్ రాజ్ కంపోజ్ చేసి, స్వయంగా పాడిన ఈ ఆడియో గ్లింప్స్ అందరిని ఆకట్టుకుంది. డివోషనల్ డెప్త్, రా ఎనర్జీతో కూడినన ఈ పాట సినిమా ఎసెన్స్ ని ప్రజెంట్ చేస్తోంది.
 
జటాధరలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, సుభలేఖ సుధాకర్‌తో పాటు ప్రముఖ కనిపించనున్నారు. మంచికి–చెడుకి, వెలుగుకి–చీకటికి, మానవ సంకల్పానికి– విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని ఈ చిత్రం చూపించబోతోంది.
 
జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. అక్షయ్ కేజ్రీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలుగా వ్యవహరించారు. డివ్యా విజయ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, భావిని గోస్వామి సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు.
 
సినిమాకి పవర్ ఫుల్ సౌండ్‌స్కేప్‌ను జీ మ్యూజిక్ కో అందిస్తోంది. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Shraddha Srinath: గేమింగ్ డెవలపర్‌గా నటించడం ఛాలెంజ్ గా వుంది: శ్రద్ధా శ్రీనాథ్