Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వినోద్ కుమార్ న‌టించిన - బుల్లెట్ సత్యం సిద్ధం

Advertiesment
Vinod Kumar
, బుధవారం, 8 డిశెంబరు 2021 (15:16 IST)
Vinod Kumar, Devaraj, Sonakshi Varma, Madhu Gopu
వినోద్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో దేవరాజ్,సోనాక్షి వర్మ హీరో, హీరోయిన్లుగా న‌టించిన సినిమా ‘బుల్లెట్ సత్యం. డిసెంబర్ 10 న విడుద‌ల కాబోతోంది. మదుగోపు దర్శకత్వంలో దేవరాజ్ నిర్మించిన‌ చిత్రం. చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు. 
 
సీనియర్ నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ,  ఈ చిత్రంలో  నేను పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న పాత్ర చేశాను. దర్శకుడు చక్కని సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకున్నాడు ఇందులో ఫ్యామిలీ ఓరియెంటెడ్, పొలిటికల్ క్రైమ్,థ్రిల్లర్ ఇలా అన్ని షేడ్స్ ఉన్న డీఫ్రెంట్ సినిమా ఇది.ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. డర్శకుడు నిజామాబాద్ ను రాజమండ్రి లో ఆట్మాస్ఫియర్ లా చూపించాడు.ఈ నెల 10 న విడుదల అవుతున్న మా సినిమా బెస్ట్ సినిమా అవుతుంది. ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆదరించి పెద్ద హిట్ అయ్యేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు
 
హీరో, నిర్మాత దేవరాజ్ మాట్లాడుతూ ...వినోద్ కుమార్ గారి సీతారత్నం గారి అబ్బాయి,మామగారు వంటి సినిమాలు ఇప్పటికీ ఫెవరేట్ గా నిలిచాయి.తను ఈ సినిమాలో నటించడం మాకు పెద్ద అసెట్.ఈ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది.ఇందులో ఉన్న అన్ని పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.రాంబాబు మంచి పాటలు రాశారు..యాజమాన్య మంచి సంగీతం ఆదించారు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఈ చిత్రం ఎక్కడా కూడా సినిమా టిక్ గా ఉండదు అని అన్నారు.
 
చిత్ర దర్శకుడు మధు గోపు మాట్లాడుతూ, విలేజ్ లో ఉండే ఎంపీటీసీ ఆలోచనలు ఎలా ఉంటాయి. అక్కడ ఎంపిటిసి పోస్ట్ కోసం వారు ఎలా పరితపిస్తారు. ఆ  ఎంపిటిసి అవ్వడం కోసం తను లైఫ్ లో ఏం కోల్పోయాడు. ఎవరితో తలపడాల్సి వచ్చింది అనేదే కథ. రాంబాబు చక్కటి సాహిత్యాన్ని అందించారు.. టెక్నీషియన్స్ అందరూ చాలా చక్కగా సహకరించడంతో సినిమా చాలా బాగా వచ్చింది అందరూ ఈ టైటిల్ బాగుందని అప్రిసియేట్ చేస్తున్నారు.ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దేవరాజ్ గారికి ధన్యవాదాలు తెలిపారు.
 
గీత ర‌చ‌యిత రాంబాబు గోశాల మాట్లాడుతూ. ఇందులో ఉన్న మూడు పాటలు నేనే రాశాను. ఇందులో ఉన్న రామసక్కని సిలక కు మంచి రెస్పాన్స్ వస్తుంది. యాజమాన్య గారు మంచి సంగీతం,ఆర్.ఆర్ ఆదించారని తెలిపారు. ఇంకా కమెడియన్ చలాకీ చంటి, ధనరాజ్, హీరోయిన్ సోనాక్షి వర్మత‌దిత‌రులు మాట్లాడారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోహెల్ హీరోగా ల‌క్కీ మీడియా చిత్రం బూట్ క‌ట్ బాల‌రాజు