Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోహెల్ హీరోగా ల‌క్కీ మీడియా చిత్రం బూట్ క‌ట్ బాల‌రాజు

సోహెల్ హీరోగా ల‌క్కీ మీడియా చిత్రం బూట్ క‌ట్ బాల‌రాజు
, బుధవారం, 8 డిశెంబరు 2021 (14:55 IST)
Sohel, Ananya
బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్‌, అన‌న్య నాగ‌ళ్ల హీరో హీరోయిన్లుగా ల‌క్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం `బూట్ క‌ట్ బాల‌రాజు`. శ్రీ కోనేటి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఈ రోజు హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. మొద‌టి స‌న్నివేశానికి దిల్‌రాజు క్లాప్ కొట్టగా మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. అనిల్ రావిపూడి గౌర‌వ ద‌ర్శ‌కత్వం వ‌హించారు.  
 
ఈ సంద‌ర్భంగా బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, ఇలాంటి క‌థ సోహెల్ కి క‌రెక్ట్. హుశారు త‌ర్వాత ఆ త‌ర‌హాలో మ‌రో మంచి క‌థ‌లో వ‌స్తున్న‌ సినిమా బూట్‌క‌ట్ బాల‌రాజు. జ‌న‌వ‌రి, పిబ్ర‌వ‌రిలో వ‌రుస‌గా షెడ్యూల్స్ జ‌రిపి సినిమా పూర్తి చేస్తాం. తెలంగాణ క్యారెక్ట‌రైజేష‌న్ కావ‌డంతో తెలుగ‌మ్మాయి కావాల‌ని అన‌న్య‌ని తీసుకున్నాం. నామిత్రుడు భాష గ్లోబ‌ల్ ఫిలింస్‌తో ఈ సినిమాతో అసోసియేట్ అవుతున్నారు`` అన్నారు.  
 
సోహెల్ మాట్లాడుతూ - ``బిగ్‌బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత చేస్తున్న రెండో చిత్ర‌మిది. దాదాపు తొమ్మిది నెల‌లు స్క్రిప్ట్ మీద వ‌ర్క్ చేశాం. మంచి స్క్రిప్ట్ కుదిరింది. డైలాగ్స్ చాలా బాగా వ‌చ్చాయి. బూట్ క‌ట్ బాల‌రాజు అనే క్యారెక్ట‌ర్ డెఫినెట్‌గా మీ అంద‌రిలో ఉండిపోతుంది. అన్ని వ‌ర్గాల వారు త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు. కోనేటి శ్రీ‌ను చాలా ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్‌. దాదాపు తొమ్మిది నెల‌లు స్క్రిప్ట్ మీద వ‌ర్క్ చేశాం`` అన్నారు.
 
అన‌న్య నాగ‌ళ్ల మాట్లాడుతూ - ``మ‌ల్లేశం సినిమా నుండి పెర్‌ఫామెన్స్ ఓరియెంటెట్ క్యారెక్ట‌ర్స్ రావ‌డం మొద‌లైంది. ఈ సినిమాలో కొంచెం బ‌బ్లీగా ఉండే క్యారెక్ట‌ర్. నాకు చాలా ఇష్ట‌మైన పాత్ర‌. మంచి ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌. ల‌క్కీ మీడియాలో సోహెల్‌తో క‌లిసి చేయ‌డం చాలా హ్యాపీ`` అన్నారు.
 
ద‌ర్శ‌కుడు శ్రీ కోనేటి మాట్లాడుతూ - ``ఈ క‌థ ఇంత‌బాగా రావ‌డానికి నా చిన్న‌నాటి మిత్రుడు గోపి కార‌ణం. మేం ఇద్ద‌రం క‌లిసి చాలా రోజుల క్రిత‌మే సినిమా చేయాల్సింది. కాస్త ఆల‌స్య‌మైంది. బూట్‌క‌ట్ బ‌ల‌రాజు  క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. రెండు గంట‌లు హ్యాపీగా న‌వ్వుకునే సినిమా`` అన్నారు.
 
న‌టీన‌టులు:  సోహెల్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, శ్రీ‌మ‌తి ఇంద్ర‌జ‌, వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, ఆనంద్ చ‌క్ర‌పాణి, ఝాన్సి, జ‌బ‌ర్‌ద‌స్త్ రోహిణి, మాస్ట‌ర్ రామ్ తేజ‌స్‌
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమ-కెమిస్ట్రీ, సెక్స్-ఫిజిక్స్ అంటున్న వర్మ, మరి నెటిజన్స్ ఏమంటున్నారో తెలుసా?