Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 30 April 2025
webdunia

సముద్రాన్ని కబళించే రోజు దగ్గర్లోనే ఉంది : నటి శ్రీరెడ్డి కామెంట్స్

క్యాస్టింగ్ కౌచ్‌ వ్యవహారంలో ఒక్కసారి వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. ఈ క్యాస్టింగ్ కౌచ్ కాస్త మరో మలుపుతిరిగి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబానికి తాకింది. ఈ వివాదం మరింతగా రాజుకోవడంతో శ్రీ

Advertiesment
Sri Reddy
, గురువారం, 26 ఏప్రియల్ 2018 (13:08 IST)
క్యాస్టింగ్ కౌచ్‌ వ్యవహారంలో ఒక్కసారి వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. ఈ క్యాస్టింగ్ కౌచ్ కాస్త మరో మలుపుతిరిగి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబానికి తాకింది. ఈ వివాదం మరింతగా రాజుకోవడంతో శ్రీరెడ్డి సారీ చెప్పింది. ఆ తర్వాత ఆమె మౌనంగా ఉంటోంది. ప్రస్తుతం తాను మౌనంగా ఉన్నానని, అయితే సముద్రాన్ని కబళించే రోజు దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యానించింది.

ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ, 'వింటున్నా ప్రతి సుత్తి దెబ్బనీ, చూస్తున్నా ప్రతి కలుపు మొక్క ఎదుగుదలనీ, భరిస్తున్నా నా వంటిపై పడుతున్న వేడివేడిగా కాల్చిన వాతలని, నా మౌనం సముద్రాన్ని కదిలించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి' అని వ్యాఖ్యానించింది. 
 
అంతకుముందు ఓ కవితను పోస్టు చేస్తూ, జీవితం ఓడించిన ప్రతిసారీ ఓ పక్షిలా రెక్కలు విప్పుకోవాలని ఉంటుందని, భూమిని చీల్చుకునే విత్తులా తలెత్తాలని ఉందని చెప్పింది. కాగా, శ్రీరెడ్డి టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై వినూత్న రీతిలో నిరసన తెలిపి, మహిళా సంఘాల మద్దతు కూడగట్టి, ఉద్యమాన్ని లేవదీసి, సినీ ఇండస్ట్రీని కదిలించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'సాహో' షూటింగ్ జరుగుతుండగానే.. జిల్ రాధాకృష్ణ- పూజా హెగ్డేతో ప్రభాస్