Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీరియల్ నటి శ్రావణిని నమ్మించి మోసం చేసిన దేవరాజ్

Advertiesment
సీరియల్ నటి శ్రావణిని నమ్మించి మోసం చేసిన దేవరాజ్
, బుధవారం, 9 సెప్టెంబరు 2020 (15:36 IST)
గత ఎనిమిది సంవత్సరాల నుండి టీవీ సీరియల్‌లో మౌన రాగం, మనసు మమతతో పాటు పలు సీరియల్స్‌ల్లో నటిస్తున్న కొండపల్లి శ్రావణి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్‌లోని ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.
 
కొంతకాలం క్రితం కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డి, టిక్ టాక్‌లో శ్రావణికి పరిచయం అయ్యాడు. తనకు తల్లిదండ్రులు లేరని తనతో పాటు తన చెల్లి ఉందని ఆమెను తనే చూసుకోవాలి అంటూ శ్రావణిని మభ్యపెట్టాడు దేవరాజ్.
 
తను హైదరాబాద్‌కు వస్తానని తనకు ఉపాధి కల్పించాలని శ్రావణిని దేవరాజ్‌ వేడుకున్నాడు. శ్రావణి మానవతా దృక్పథంతో దేవరాజ్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చి సీరియల్స్‌లో అవకాశం ఇప్పించింది.
 
అంతేకాదు అతడి కోసం హాస్టల్ కూడా చూసింది. హాస్టల్లో ఫుడ్ పడటం లేదంటూ పథకం ప్రకారం శ్రావణి ఇంట్లో తిష్ట వేశాడు దేవరాజ్. శ్రావణి పడుకున్నప్పుడు ఆమె ఫింగర్ ప్రింట్ సహాయంతో శ్రావణి మొబైల్‌ను అన్‌లాక్ చేసిన దేవరాజ్‌ ఆమె పర్సనల‌్‌ ఫోటోలను, వీడియోలను తన మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు దేవరాజ్‌.
 
దేవరాజు రెడ్డిపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో గతంలో ఫిర్యాదు చేశారు శ్రావణి కుటుంబ సభ్యులు. 
అయినా దేవరాజ్‌‌లో మార్పు రాలేదు. మళ్ళీ ఇటీవల అతను శ్రావణికి టచ్ లోకి వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చివరకు అతని బ్లాక్‌మెయిల్ తాళలేక రాత్రి బాత్రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకున్నదని శ్రావణి కుటుంబ సబ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎస్ఆర్ నగర్ పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దేవరాజ్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతను కాకినాడలో వున్నట్టు గుర్తించారు పోలీసులు. అతడి కోసం ప్రత్యేక బృందాన్ని అక్కడకి పంపిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయప్రకాష్ రెడ్డి కుటుంబానికి బాలయ్య ఆర్థిక సాయం?