Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షాపింగ్‌మాల్ ఫంక్షన్‌లో మెరిసిన అఖిల్‌తో సమంత.. చీరలో ఉన్న నిండుదనం..?

టాలీవుడ్ హీరో, కింగ్ నాగార్జున చిన్నకొడుకు అఖిల్ సమంతకు చాలా ముద్దొస్తున్నాడట. అక్కినేని కోడలు కానున్న నాగార్జున ఫ్యామిలీ గురించి బాగా ఆసక్తి పెంచుకున్న సమంత “సిసింద్రీ’ సినిమాను చూసిందట. అందులో చిన్న

Advertiesment
South India Shopping Mall @ Somajiguda
, శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (09:44 IST)
టాలీవుడ్ హీరో, కింగ్ నాగార్జున చిన్నకొడుకు అఖిల్ సమంతకు చాలా ముద్దొస్తున్నాడట. అక్కినేని కోడలు కానున్న నాగార్జున ఫ్యామిలీ గురించి బాగా ఆసక్తి పెంచుకున్న సమంత “సిసింద్రీ’ సినిమాను చూసిందట. అందులో చిన్నారి అఖిల్ సమంతకు తెగనచ్చేశాడట. అతడు చాలా క్యూట్‌గా కనిపిస్తుండటంతో ఎంతగానో లైక్ చేస్తోందట. తాను కానీ ఇప్పట్లో హీరోయిన్ అయ్యి సెట్స్ మీద ఉండుంటే… కచ్చితంగా అఖిల్‌ను ఎత్తుకుని వెళ్లిపోయేదాన్నని చెప్పింది. 
 
తాజాగా అదే అఖిల్‌తో సమంత ఓ కార్యక్రమంలో కనువిందు చేసింది. అక్కినేని కుటుంబానికి సమంత కోడలు కానున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్యతో ఆమె వివాహం పక్కా అయిన సంగతి విదితమే. గత కొంత కాలంగా ప్రేమలో వున్న ఈ జంట ఇప్పుడు తమ పెళ్లి విషయానికి వెల్లడించాయి. అటు నాగార్జున కూడా వీరి పెళ్ళికి పచ్చజెండా ఊపేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరిది అఖిల్‌తో కలసి ఓ చీరాల షాప్ ఓపెనింగ్‌కి వచ్చింది సామ్. వీరిద్దరు కలసి సోమాజిగూడలో కొత్త ఏర్పాటుచేసిన ఓ షాపింగ్‌మాల్‌ను ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా మాట్లాడిన సమంత.. మహిళలకు చీరకట్టే అందమని, సందర్భాన్ని బట్టి తాను దుస్తులు ధరిస్తానని, అయితే చీరలో ఉన్నంత నిండుదనం మరి ఎందులో వుండదని చెప్పుప్పు కొచ్చింది. కాగా, సమంత , అఖిల్‌ల రాక గురించి తెలుసుకున్న అభిమాను వీరి చూడడానికి భారీగా ఎగబడ్డారు. దీంతో వీరిని నియత్రించడం పోలీసులకు పనిగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సరదాగా నగ్నంగా తీసుకున్న సెల్ఫీలు.. వసుంధర కశ్యప్ కొంపముంచాయ్.. మళ్లీ నెట్లో..