Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మళ్లీ బిడ్డకు జన్మనిచ్చిన సౌందర్య రజనీకాంత్

Advertiesment
soundarya rajinikanth
, సోమవారం, 12 సెప్టెంబరు 2022 (07:38 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ మళ్లీ మరో బిడ్డకు జన్మనిచ్చింది. సౌందర్య - విశాగన్ దంపతులకు ఆదివారం పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ చిన్నారికి వీర్ రజనీకాంత్ అని పేరు కూడా పెట్టేశారు. ఈ విషయాన్ని సౌందర్య రజనీకాంత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. 
 
"దేవుని దయ, తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో వేద్‌కృష్ణ, తమ్ముడు వీర్ రజనీకాంత్ వనంగామూడికి విశాగన్, వేద్, నేను స్వాగతం పలుకుతున్నాం. డాక్టర్ సుమన మనోహర్, డాక్టర్ శ్రీవిద్య శేషాద్రికి ధన్యవాదాలు" అని ఆ పోస్టులో ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు కొన్ని ఫోటోలను ఆమె షేర్ చేశారు. 
 
కాగా, సౌందర్య రజనీకాంత్‌కు గతంలో ఓ యువ వ్యాపారవేత్తతో వివాహం జిగింది. వీరికి వేద్‌‍కృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. పిమ్మట గత 2019లో మరో వ్యాపారవేత్త విశాగన్‌ వనంగామూడిని సౌందర్య పెళ్లి చేసుకున్నారు. తాజాగా వీరికి ఓ మగబిడ్డ జన్మించాడు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమగా పలుకరించే గొంతు మూగబోయింది : మోహన్ బాబు