Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు పాప్ సింగర్ స్మిత పుట్టిన రోజు.. ఈ విషయాలు మీకు తెలుసా?

Advertiesment
smitha
, సోమవారం, 5 సెప్టెంబరు 2022 (10:13 IST)
"హాయ్ రబ్బా" అంటూ కొన్నాళ్ళపాటు తెలుగువారిని తన ఆటపాటలతో స్టెప్పులు వేయించిన పాప్ సింగర్ స్మిత. ఆ తర్వాత కొన్ని రిమిక్స్ సాంగులతో ఆలరించింది. పలు చిత్రాల్లో స్పెషల్ సాంగుల్లో నర్తించారు. ఈ క్రమంలో ఆమె సెప్టెంబరు 5వ తేదీన తన 43వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం..
 
ఏపీ వాణిజ్య రాజధాని అయిన విజయవాడకు చెందిన స్మిత.. తన కెరీర్‌కు 23 యేళ్లు పూర్తి చేసుకుంది. గత 1997లో ప్రముఖ టీవీలో ప్రసారమైన "పాడుతా తీయగా" కార్యక్రమం తర్వాత తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత "హాయ్ రబ్బా" అనే పాటతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు. 
 
దీంతో ఆమెకు పలు చిత్రాల్లో నటించే అవకాశం కూడా వచ్చింది. ఇందులోభాగంగా, ఆమె "కిలి కిలి" అనే పాటతో ప్రతి ఒక్కరినీ మెప్పించారు. "నా పేరు ఆంధ్రా.. నా వయస్సు 5 యేళ్లు" అనే పేరుతో రూపొందించిన వీడియోలో స్మిత కుమార్తె శివి కూడా ఓ కీలక పాత్రను పోషించింది. ముఖ్యంగా, గత ఎన్నికల సమయంలో ఆమె చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్నే రేపింది. 
 
ఆసమయంలో "గుణం లేనివాడు కులం గొడుగు పడతారు.. మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు. పసలేనివాడు ప్రాంతం ఊసెత్తుతాడు. జనులంతా ఒక కుటుంబం. జగమంతా ఒక నిలయం" అంటూ గుర్రం జాషుగా నీతి వ్యాఖ్యాలను ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాధతో శ్రియ.. ఫోటోలు వైరల్