Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం ఆఫర్ వచ్చింది.. సున్నితంగా తిరస్కరించా : సోను సూద్

Sonu Sood

ఠాగూర్

, శుక్రవారం, 27 డిశెంబరు 2024 (10:10 IST)
బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోను సూద్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ వచ్చిందని, కానీ, దాన్ని సున్నితంగా తిరస్కరించినట్టు తాజాగా వెల్లడించారు. 
 
సాధారణంగా చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగే నటీనటులు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఉన్నత పదవులను అధిరోహిస్తుంటారు. ఇలాంటి వారిలో దివంగత నటులు ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలితలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. వీరంతా ముఖ్యమంత్రులుగా అద్భుతంగా బాధ్యతలు నిర్వహించి ప్రజలకు సేవ చేశారు. 
 
అలాగే, పలువురు నటీనటులు ఎమ్మెల్యే, ఎంపీలుగా ఎన్నికై కేంద్ర, రాష్ట్ర మంత్రులుగానూ పని చేశారు. అయితే, కరోనా సమయంలో ఎంతో మందికి తన వంతు సాయం అందించి రియల్ హీరోగా గుర్తింపు పొందిన బాలీవుడ్ స్టార్ నటుడు సోను సూద్ కూడా రాజకీయాల్లోకి రానున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై సోను సూద్ తాజాగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
ఓ మూవీ ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో సోను సూద్ మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో ప్రజలకు సాయం చేసినందుకు తనకు సీఎం, డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు అయ్యే అవకాశాలు వచ్చాయన్నారు. అయితే, ఆ అభ్యర్ధనలను తిరస్కరించినట్లు చెప్పారు. స్వేచ్ఛను కోల్పోవడం ఇష్టం లేదని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని సోను సూద్ తెలిపారు.
 
సాధారణంగా ప్రజలు రెండు కారణాలతో రాజకీయాల్లోకి వస్తారని, ఒకటి డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమని, అయితే తనకు వీటిలో దేని పైనా ఆసక్తి లేదని సోను సూద్ అన్నారు. ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటే తాను ఇప్పటికే అది చేస్తున్నానని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Game changer DHOP, చెర్రీ-కియారా ధోప్ సాంగ్ సోషల్ మీడియాలో షేక్ (Video)