Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోనూ ప్రధాని కావాలన్న హుమా.. అబ్బే అంత వయస్సు లేదన్న హీరో

Advertiesment
Sonu Sood
, సోమవారం, 7 జూన్ 2021 (12:44 IST)
కరోనా కాలంలో వలస కార్మికులను సోనూ సూద్ కాపాడారు. ప్రస్తుతం కరోనా రెండో దశలోనూ దేశంలో ఎవరైనా సాయం కోరితే.. వెంటనే స్పందిస్తూ ఆపద్భాందవుడిలా ఆదుకుంటున్నాడు. దాంతో చాలామంది ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి హూమా ఖురేషి. సోనూసూద్ ప్రధానమంత్రి కావాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ వ్యాఖ్యలకు కొందరు నెటిజన్లు కూడా మద్దతు తెలిపారు. సోనూ లాంటి ఉదార స్వభావం వున్న వ్యక్తి పీఎం అయితే.. దేశం బాగుపడుతుందని కామెంట్లు కూడా చేశారు.
 
అయితే.. ఖురేషీ సహా నెటిజన్ల కామెంట్లపై సోనూసూద్ స్పందించారు. "ఆమె నా గురించి ఇలా చెప్పడం ఆమె మంచి మనసుకు నిదర్శనం. నేను ఈ గౌరవానికి అర్హుడిని అనుకుంటే, నేను తప్పక ఏదైనా మంచి పని చేశాననే చెప్పాలి. కానీ ఆమె చెప్పిన మాటలకు నేను ఏకీభవించను. ఇప్పుడు మనకు సమర్థవంతమైన ప్రధాని ఉన్నారు. ఇంకా నాకు అంత వయసు కూడా రాలేదు. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి" అని పేర్కొన్నారు. ఇప్పుడు సామాన్యుల కష్టాలలో ఒకడిగా భాగం పంచుకుంటున్నాను. అధికారం, పదవి లేకుండా కూడా మనందరం కలిసి పనిచేయగలమని అనుకుంటున్నా.. అని సోనూ వ్యాఖ్యానించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలాంటి సంబంధం వ‌దిలేయండిః పూరీజ‌గ‌న్నాథ్‌