Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Niharika Konidela: రాకాస నుంచి స్నేక్ డ్యాన్స్ వీడియో సాంగ్ రిలీజ్

Advertiesment
Rakasa Snake Dance
Rakasa Snake Dance
నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కించిన ‘కమిటీ కుర్రోళ్లు’తో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇక ప్రస్తుతం నిహారిక జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు.
 
ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ని చిత్రయూనిట్ ప్రారంభించింది. ఇప్పటి వరకు ‘రపప్పా’, ‘పదే పదే’ పాటల్ని మేకర్లు రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ‘స్నేక్ డ్యాన్స్’ అనే పాటను విడుదల చేశారు. ఈ వీడియో సాంగ్‌ని చూస్తుంటే ఇదొక ప్రమోషనల్ గీతంగా కనిపిస్తోంది. గ్యాంగ్ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఈ పాటను కంపోజ్ చేశారు.
 
‘స్నేక్ డ్యాన్స్’ పాటలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, సంగీత్ శోభన్, నయన్ సారిక తమ స్టైల్లో దుమ్ములేపేశారు. ఇక చివర్లో మెగా ప్రొడ్యూసర్ నిహారిక వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. ఈ పాటకు అనుదీప్ క్యాచీ ట్యూన్‌ను ఇచ్చారు. రఘురాం సాహిత్యం ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. బెన్నీ దయాల్, మనీషా పాండ్రంకి, రితేష్ జి రావు, లక్ష్మీ మేఘన, వినాయక్ గాత్రం ఈ పాటకు ప్రధాన ఆకర్షణ.
 
రాజు ఎదురోలు ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా, అన్వల్ అలీ ఎడిటర్‌గా పని చేశారు.  ఏప్రిల్ 3న ఈ మూవీని భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నారు.
 
నటీనటులు : సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తదితరులు
 
సాంకేతిక బృందం:
బ్యానర్: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్
నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్
రచన & దర్శకత్వం : మానస శర్మ
DOP : రాజు ఎదురురోలు
సంగీతం : అనుదీప్ దేవ్
ఎడిటర్ : అన్వర్ అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమేష్ మన్యం
కొరియోగ్రఫీ : జెడి, భాను
ఆర్ట్ డైరెక్టర్ : విష్ణు వర్ధన్ పుల్లా
కాస్ట్యూమ్ డిజైనర్ : సంధ్య సబ్బవరపు
పీఆర్వో : నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Teja Sajja : ఓటీటీ రియాలిటీ షో ది ట్రైటర్స్ హోస్ట్ గా తేజ సజ్జా