Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిన్న సినిమా అంటే మధ్యతరగతి కుటుంబం - కొత్త కొత్తగా ప్ర‌మోష‌న్‌లో మారుతి

Advertiesment
Maruti, Ajay, Veerthi Vaghani, Hanuman Vasamshetty, Trinath Rao Nakkina, Shekhar Chandra
, మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (17:37 IST)
Maruti, Ajay, Veerthi Vaghani, Hanuman Vasamshetty, Trinath Rao Nakkina, Shekhar Chandra
ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అజయ్‌, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, హనుమాన్ వాసంశెట్టి ద‌ర్శక‌త్వంలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ `కొత్త కొత్తగా'. బి జి గోవింద రాజు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 9న  ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. దర్శకులు మారుతి, త్రినాథ్ రావు నక్కిన, గోపినాథ్ రెడ్డి ఈ ఈవెంట్ లో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
 
మారుతి మాట్లాడుతూ.. చిన్న సినిమా మధ్యతరగతి కుటుంబం లాంటింది. మధ్య తరగతి బావుంటేనే మిగతా తరగతులు బావుంటాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. దినిని ప్రీరిలీజ్ లా కాకుండా సక్సెస్ మీట్ లానే జరుపుకుంటున్నారు. చాలా ఆనందంగా వుంది. ఇలాంటి సినిమాని ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి అన్నారు.
 
త్రినాథ్ రావు నక్కిన మాట్లాడుతూ..  ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ప్రియతమా పాట నాకు చాలా నచ్చింది. ఈ సినిమా దర్శకుడిగా హనుమాన్ కి మంచి విజయం దక్కాలి. అజయ్‌, వీర్తి కెమిస్ట్రీ బావుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి'' అని కోరారు
 
గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ..  అజయ్‌, వీర్తి,  గోవింద రాజు గారు మిగతా టీం అందరికీ ఆల్ ది బెస్ట్.   శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి' అని కోరారు
 
ఎస్కేఎన్ మాట్లాడుతూ.. శేఖర్ చంద్ర అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు సూపర్ హిట్ కావడం ఈ సినిమా మొదటి విజయం. ట్రైలర్ యూత్ కి నచ్చేలా వుంది. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని కోరారు
అజయ్‌ మాట్లాడుతూ.. ఇక్కడి వచ్చి మాకు విష్ చేసిన మారుతి గారికి, త్రినాధ్ గారికి కృతజ్ఞతలు. దర్శకుడు హనుమాన్ ఈ సినిమా కోసం నాకంటే పది రేట్లు ఎక్కువ కష్టపడ్డారు. గోవింద రాజు గారు ఇంత మంచి  సినిమా నాకు ఇచ్చారు. శేఖర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. హరి కిరణ్ గా చాలా కూల్ గా వుండి కోరియోగ్రఫీ చేశారు. మిగతా సాంకేతిక నిపుణులు అద్భుతంగా చేశారు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా చేశారు. ఇంత మంచి టీంతో నాకు సినిమా ఇచ్చిన గోవింద రాజు గారికి కృతజ్ఞతలు. సెప్టెంబర్ 9న సినిమా వస్తోంది. ప్రేక్షకులు థియేటర్ లో చూసి మంచి విజయం అందించాలి''  అని కోరారు
 
దర్శకుడు హనుమాన్ మాట్లాడుతూ.. ,మా సినిమాని ఆశీర్వాదించడానికి వచ్చిన మారుతి, త్రినాద్, సోహెల్,  గోపినాథ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. టైటిల్ లానే సినిమా చాలా కొత్తగా వుంటుంది. అబ్బాయికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి ఇష్టపడని ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించే అబ్బాయి మధ్య జరిగే వండర్ ఫుల్ కథ ఇది. కథ వినగానే శేఖర్ చంద్ర చాలా సర్ ప్రైజ్ అయ్యారు. మంచి మ్యూజిక్ ఇచ్చారు. వెంకట్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఎడిటర్ ప్రవీణ్ పూడిగారు చక్కగా ఎడిటర్ చేశారు. హరి కిరణ్ మాస్టర్ ఎంతో అందం గా కోరియోగ్రఫీ చేశారు.  కో డైరెక్టర్ పుల్లారావు మాకు గురువు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా తీశారు. ఈ సినిమా చివరవరకు ప్రేక్షకులని యంగేజ్ చేస్తుంది. అజయ్‌, వీర్తి  అద్భుతంగా చేశారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం ప్రేక్షకులు ఇస్తారని నమ్ముతున్నాను'' అన్నారు
 
సోహెల్ మాట్లాడుతూ., అజయ్‌ లో చాలా ఫైర్ వుంది. తొలి సినిమానే చాలా అనుభవం వున్న నటుడిగా చేశాడు. ఈ సినిమాతో పెద్ద విజయం సాధించాలి. అజయ్‌, వీర్తి క్యూట్ గా కనిపిస్తున్నారు. చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి'' అని కోరారు.
 
శేఖర్ చంద్ర మాట్లాడుతూ.. ఈ వేడుకకి వచ్చిన మారుతి, త్రినాద్ రావుకి కృతజ్ఞతలు. దర్శకుడు  హనుమాన్ గారు చాలా కొత్త కథ చెప్పారు. అందుకే పాటలు కొత్తగా వచ్చాయి.  గోవింద రాజుగారు చాలా సపోర్ట్ చేశారు. అనంత శ్రీరామ్ , కాసర్ల శ్యాం, శ్రీమణి చక్కగా పాటలు రాశారు. సిద్ శ్రీరామ్, అనురాగ్ కులకర్ణి మిగతా గాయకలు అద్భుతంగా పాడారు. సినిమా చాలా కొత్తగా వుంటుంది. మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.
 
అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. ఇందులో ప్రియతమా అనే పాట రాశాను. నా 1300 వందల పాటల్లో గుర్తుపెట్టుకునే పక్తులు అరుదుగా వుంటాయి. లాంటి అరుదైన మాటలు ఈ పాటలో కుదిరాయి. శేఖర్ చంద్ర అద్భుతమైన సంగీతం అందించారు. టైటిల్ లో వున్న కొత్తదనం సినిమాలో వుంటుంది. సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రైమ్ వీడియోలో ప్రత్యేక స్ట్రీమింగ్ కాబోతున్న సీతా రామం