తేజ - కాజల్ మూవీ "సీత" సెన్సార్ పూర్తి

గురువారం, 16 మే 2019 (16:26 IST)
దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం సీత. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం సీత. ఇందులో యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించారు. 
 
ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని... సెన్సార్ బోర్డు నుండి 'యు' సర్టిఫికేట్‌తో బయటకు వచ్చింది. దీంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహించగా... ఇందులో విలన్‌గా సోనూ సూద్ నటించాడు. 
 
ఈ సినిమా ప్రమోషన్స్‌లో తేజ మాట్లాడుతూ, కాజల్ ఈ పాత్రని తానే చేస్తానని పట్టుబట్టినట్టుగా చెప్తూ... ఈ పాత్ర ఆవిడ కెరీర్‌లోనే చెప్పుకోదగినదిగా నిలిచిపోవడం ఖాయమంటూ ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంత మేరకు అందుకుంటుందో వేచి ఉండాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం "సైరా"లో క్యామియో పాత్రలో అనుష్క?