Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గిరిజన రాజకీయ ప్రేమ కథతో సిరిమల్లె పువ్వా

Nikki Sravani, Srikar Krishna
, సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (09:25 IST)
Nikki Sravani, Srikar Krishna
 ప్రజలను దోచుకోవడం కాదు, ప్రజలను కాచుకునే నాయకుడిగా గెలవాలని, నిలవాలని, మిగలాలనీ, తలచే, తపించే ఓ నిస్వార్ధ నాయకుడి రాజకీయ జీవన ప్రవాసంలోకి, ఆయన కొడుకు హృదయంలోకి అడుగిడిన ఓ అడవిమల్లి జీవితం నేపథ్యంలో సిరిమల్లె పువ్వా చిత్రం రూపొందుతోంది. రాజకీయ నాయకుడి చెరను చేదించుకొని బయటపడి ఓ స్వచ్ఛమైన సిరిమల్లెలా ఎలా విరిసి వికసించిందనే అంశాలతో పాటు గిరిజన నేపథ్యంలో సాగిన ఓ భిన్నమైన రాజకీయ  ప్రేమ కథే "సిరిమల్లె పువ్వా".
 
షకీరా  మూవీస్ పతాకంపై శ్రీకర్ కృష్ణ, శ్రావణి నిక్కీ, అజయ్ ఘోష్, జయ నాయుడు, అమ్మ రమేష్,  షఫీ క్వాద్రి నటీ నటులుగా గౌతమ్ మైలవరం దర్శకత్వంలో కౌసర్  జహాన్ నిర్మించిన  చిత్రం  "సిరిమల్లె పువ్వా". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని  ఫిబ్రవరి 10 న గ్రాండ్ గా థియేటర్స్ లలో విడుదలవుతుంది. 
 
webdunia
Sirimalle Puvva team
డైరెక్టర్ చంద్రమహేష్ మాట్లాడుతూ.. మంచి టైటిల్ తో వస్తున్న "సిరిమల్లె పువ్వా" చిన్న సినిమా అయినా కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సినిమా ట్రైలర్ చాలా బాగుంది. అందుకే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి చిత్ర దర్శక, నిర్మాతలకు  మంచి పేరును తీసుకు వస్తుంది. చిత్ర దర్శకుడు గౌతమ్ గారికి సినిమా అంటే ఎంతో ఇష్టం. తను  మంచి కథ రాసుకొని సినిమా తియ్యాలనే ప్యాషన్ తో తన గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఈ సినిమా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను నిర్మాత కౌసర్  జహాన్ చాలా చక్కగా నిర్మించారు. మంచి కథ, మంచి టైటిల్ తో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.
 
ఇంకా  చిత్ర నిర్మాత కౌశర్ జహాన్,దర్శకులు గౌతమ్,  డైరెక్టర్ సముద్ర, నిర్మాత పద్మిని నాగులాపల్లి, నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.మంచి టైటిల్ తో  వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు... 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా ప్రియతమ ఆత్మ అయాన్ : అల్లు అర్జున్ ట్వీట్