Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా భర్త మూర్ఖుడు.. పక్కనే ఉంటూ మోసం చేశాడు.. పిల్లాడికి సినిమాల్లోకి రావాలనుంది: సునీత

భర్తతో బ్రేకప్.. మధుయాష్కీతో సంబంధాలపై సింగర్ సునీత ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. తన భర్త తనను చీట్ చేశారని.. సర్దుకుపోయి.. అతను చాలా మారతాడని టైమిచ్చాకే అతనికి దూరమైనట్లు సునీత వెల్లడించారు.

నా భర్త మూర్ఖుడు.. పక్కనే ఉంటూ మోసం చేశాడు.. పిల్లాడికి సినిమాల్లోకి రావాలనుంది: సునీత
, మంగళవారం, 26 జులై 2016 (15:31 IST)
భర్తతో బ్రేకప్.. మధుయాష్కీతో సంబంధాలపై సింగర్ సునీత ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. తన భర్త తనను చీట్ చేశారని.. సర్దుకుపోయి.. అతను చాలా మారతాడని టైమిచ్చాకే అతనికి దూరమైనట్లు సునీత వెల్లడించారు. జీవితంలో జీవిత భాగస్వామిని నమ్మాలి. నమ్మాను. కానీ అవతలి వ్యక్తి తప్పులు చేసి, వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఊరుకోగలమా? ఎవ్వరినైనా భరించవచ్చు గానీ, పక్కనే ఉంటూ మోసం చేస్తూ ఉండే భాగస్వామిని మాత్రం భరించలేం.. నిజంగానే తన భర్త చీట్ చేశాడని సునీత చెప్పుకొచ్చింది.
 
భర్త నుంచి తాను కోరుకున్నదల్లా ''నీకు నేనున్నాను'' అనే నమ్మకం. కానీ అది లభించకపోతే పర్లేదు. బాధ్యతారహితంగా వ్యవహరించడం తనను ఎంతో బాధించిందని చెప్పారు. చివరిసారిగా అతనితో మాట్లాడానని.. డబ్బుల గురించి వదిలేసి బాధ్యతగా పిల్లాడి పెద్ద చదువుల కోసం గెడైన్స్ ఇవ్వమని చెప్పా. కానీ నీకన్నీ బాగా తెలుసు కదా అంటూ తప్పించుకున్నారని సునీత చెప్పుకొచ్చింది. 
 
పిల్లలకు మంచి జీవితం ఇస్తాననే నమ్మకం ఉంది. అయితే తన కుమారుడికి సినిమాల్లోకి రావాలనుంది. పీజీ వరకూ చదివి ఆ తర్వాత బిడ్డ ఇష్టం మేరకు చేసుకోమని చెప్పినట్లు సునీత చెప్పింది. భార్యాపిల్లల పట్ల బాధ్యతగా తన భర్త లేరు. తన కుమారుడు ఏ యూనివర్శిటీలో చదువుతాడో అతనికి తెలియదు. తెలుసుకోవాలని అనుకోడు. అంత ఇర్రెస్పాన్సిబుల్. ఇంకా తనపై వస్తున్న రూమర్స్ గురించి పట్టించుకోను. భర్త ఎలా ఉన్నా సర్దుకుపోయి వుంటే సునీత గ్రేట్ అనేవారు. లింకప్ రూమర్స్ కూడా వచ్చేవి కాదు. అయితే భరిస్తేనే తెలుస్తుంది ఆ బాధేంటో.
 
తన పిల్లలు, స్నేహితులు, తన చుట్టూ మంచి వ్యక్తులు ఉన్నారు. అందుకే తనకు మళ్లీ పెళ్లి చేసుకునే అవసరం కనిపించడం లేదు. అలాగే ఆర్థిక ఇబ్బందులున్నా ధీటుగా ఎదుర్కొంటా. పైసా అప్పు చేయను. ఉంటే తింటా లేకుంటే లేదు. డిగ్నిటీని వదులుకునే పని ఏమాత్రం చేయను. తన భర్తను మార్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నించాను. కానీ సగం తెలిసినవాడితో మాట్లాడొచ్చు. తెలియనివాడికి తెలియజెప్పొచ్చు. అన్నీ తెలిసిన వాళ్లను మార్చలేం కదా. వాళ్లు పరమ మూర్ఖుల కింద లెక్క.. అంటూ సునీత ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు శిరీష్‌ను 'తమ్ముడు' అనేసిన లావణ్య... లవ్వులో ఇదో కోణం... 'శ్రీరస్తు శుభమస్తు'(Video)