సునీత పర్సనల్ లైఫ్ గురించి ఎందుకు చెప్పింది..? అంతా పబ్లిసిటీ కోసమేనా...? ఇంకేమైనా ఉందా?
గాయనీగాయకుల్లో సునీత పేరే ప్రస్తుతం సినీ పరిశ్రమలో బాగా వినిపిస్తోంది. గాయనీగాయకులు తమ వ్యక్తిత్వాలపై ఎలాంటి మచ్చలు తెచ్చుకోకుండా తమ పని తాము చేసుకుపోతుంటే.. సునీత మాత్రం తన వ్యక్తిగత విషయాలను ఓపెన్‌గ
గాయనీగాయకుల్లో సునీత పేరే ప్రస్తుతం సినీ పరిశ్రమలో బాగా వినిపిస్తోంది. గాయనీగాయకులు తమ వ్యక్తిత్వాలపై ఎలాంటి మచ్చలు తెచ్చుకోకుండా తమ పని తాము చేసుకుపోతుంటే.. సునీత మాత్రం తన వ్యక్తిగత విషయాలను ఓపెన్‌గా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పేయడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్వ్యూలో పర్సనల్ విషయాలు బయటికి చెప్పడం ద్వారా సునీత పబ్లిసిటీ కోరుకున్నట్లేనని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్నేళ్ల పాటు భర్త వద్ద అనుభవించిన కష్టాల గురించి.. పిల్లలు మంచిగా ఎదిగాక.. బయటికి చెప్పాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేగాకుండా సునీత తన ఇంటర్వ్యూల్లో ప్రముఖుల పేర్లను వాడటం చూడా మంచి పద్ధతి కాదని సినీ విశ్లేషకులు అంటున్నారు. భర్త ఇబ్బంది పెడితే అతని నుంచి విడాకులు తీసుకుని సైలెంట్‌గా ఉండిపోక.. పర్సనల్ లైఫ్ గురించి సునీత కావాలనే బయటపెట్టిందని భర్త తరపు బంధువులు కూడా ఆడిపోసుకుంటున్నారు. ఇంకా పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సునీత.. మరిన్ని సినిమా అవకాశాల కోసం అందరి దృష్టి తనపై పడాలనే ఈ విధంగా పబ్లిసిటీ తెచ్చుకుందని సినీ పండితులు అనుమానిస్తున్నారు.
అయితే సునీత మాత్రం తనకు పబ్లిసిటీ అక్కర్లేదని తనపై వచ్చిన అఫైర్ల గురించి ఖండించడంతో పాటే తాను భర్తతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను బయటికి చెప్పాల్సి వస్తుందని తేల్చేసింది. ఎవరెన్ని చెప్పినా పట్టించుకోనని.. బయట నోటికొచ్చినట్లు మాట్లాడేవారు.. కడుపుకు అన్నం పెట్టరని.. తన చుట్టూ వున్న కుటుంబీకులు, బంధువులు, శ్రేయోభిలాషులు తన మంచే కోరుకుంటున్నారని.. వాళ్లకి నిజమేంటో తెలుసన్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారి గురించి పట్టించుకోనని చెప్పేశారు.
కాగా సునీత సింగర్ గానూ, డబ్బింగ్ ఆర్టిస్టుగానూ టాలీవుడ్‌లో రెండు దశాబ్ధాలుగా తన హవాను కొనసాగిస్తున్నారు. గతంలో ఎన్నడూ మీడియా ముందు ఫ్యామిలీ ఎఫైర్స్ గురించి పెద్దగా ప్రస్తావించని సునీత ఇటీవల తన సంసారంలో సఖ్యత లేదన్న విషయాన్ని బాహాటంగా చెప్పుకోవడం సంచలనంగా మారింది.
కెరీర్ తొలినాళ్లలోనే సునీత పెళ్లి చేసుకుంది. అయితే కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. ఇందుకు కారణం తన భర్తేనని చెప్పింది. భర్త బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమే కాకుండా తన కష్టాన్ని కూడా ఆయన ఖర్చు చేసేసేవాడన్నది సునీత వాదన. చివరకు పిల్లల కష్టసుఖాలు కూడా గాలికొదిలేశాడని చెప్పింది.
పిల్లల విషయం ప్రస్తావించినప్పటికీ ‘ఆ విషయం నా కంటే నీకే బాగా తెలుసు’ అని తప్పించుకునే వాడని సునీత వాపోతోంది. అయితే తాను చాలాకాలంగా విడివిడిగా ఉంటున్నప్పటికీ భర్తతో విడాకులు మాత్రం తీసుకోలేదని సునీత వివరణ ఇచ్చింది. విడాకులకు ఆమె భర్త సిద్ధంగా లేడంటోంది. అందుకే డైవర్స్ వ్యవహారం ముందకు సాగలేదని సునీత తెలిపింది. మ్యూజిక్ ఇనిస్టిట్యూట్ పెట్టాలనే ఆలోచన తనలో ఉందని, ఆమె శారీస్ డిజైనింగ్ మీద కూడా ఓ కన్నేసినట్టు చెబుతోంది.