Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రజనీకాంత్‌ను వృద్ధాశ్రమానికి పంపండి.. రూ.1200లకు టిక్కెట్ కొని మోసపోయా: కందస్వామి

దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌‌పై ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు విషయం ఏంటంటే... భారీ అంచనాలతో విడుదలైన కబాలి చిత్రం నెగిటివ్‌ టాక్‌‌ని సంపాదించుకుంది. అయితే కబాలి చిత్రాన్ని చూసిన చెన్నైలో

Advertiesment
Admit Rajinikanth
, శనివారం, 30 జులై 2016 (12:40 IST)
దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌‌పై ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు విషయం ఏంటంటే... భారీ అంచనాలతో విడుదలైన కబాలి చిత్రం నెగిటివ్‌ టాక్‌‌ని సంపాదించుకుంది. అయితే కబాలి చిత్రాన్ని చూసిన చెన్నైలోని వడపళనికి చెందిన కందస్వామి అనే అభిమాని పోలీసులను ఆశ్రయించాడు. 66 ఏళ్లున్నసూపర్ స్టార్ చేత చిత్ర విచిత్రమైన ఫైట్లు చేయించి దర్శకుడు, నిర్మాత తనను 3 గంటల పాటు చిత్రవధకు గురిచేశారని వాపోయాడు. 
 
సినిమా విడుదలకు ముందు ఎన్నోప్రకటనలు చేసి ఎంతో ఆసక్తి రేకెత్తించారు. దీంతో అశోక్ నగర్‌లోని కాశీ థియేటర్లో రూ.1200లకు టికెట్ కొని కబాలి సినిమా చూశాను. అయితే హీరో రజనీకాంత్, దర్శకుడు రంజిత్ ఇద్దరూ తనని మోసం చేశారని ఫిర్యాదు చేశారు. వృద్ధుడైన వ్యక్తి చేత చిత్రవిచిత్ర విన్యాసాలు చేయించి ప్రజల్ని మోసం చేశారని తెలిపాడు. వెంటనే రజనీకాంత్‌ను వృద్ధాశ్రమానికి పంపాలని పోలీస్‌ కమిషనర్‌కు ఓ వినతిపత్రం ఇచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''కబాలి'' ప్రమోషన్‌కు దూరమయ్యా: క్షమాపణలు చెప్పిన రాధికా ఆప్టే!