Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సన్నీలియోన్‌కు కష్టాలు.. ''కౌర్'' అనే పదం వాడకండి.. పాపకు పుట్టినరోజు

పోర్న్ కమ్ బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ జీవితంపై కరణ్‌జీత్ కౌర్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో సన్నీ లియోన్‌కు కొత్త సమస్యొచ్చిపడింది. జులై 5న సినిమా ట్రైలర్ రిలీజైన తర్వాత య్యూటూబ్, ట్విటర్, ఫేస్‌బు

Advertiesment
Sikhs
, మంగళవారం, 17 జులై 2018 (12:10 IST)
పోర్న్ కమ్ బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ జీవితంపై కరణ్‌జీత్ కౌర్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో సన్నీ లియోన్‌కు కొత్త సమస్యొచ్చిపడింది. జులై 5న సినిమా ట్రైలర్ రిలీజైన తర్వాత య్యూటూబ్, ట్విటర్, ఫేస్‌బుక్‌లో సినిమాకు అనుకూలంగా, వ్యతిరేకంగా కామెంట్స్ వస్తున్నాయి. వీరిలో పవన్ గోగ్నా అనే ట్విట్టర్ యూజర్ ఓ పంజాబీ సిక్కు యువతిగా సన్నీ తన పేరునే కాకుండా కుటుంబం పేరు కూడా చెడగొడుతున్నారని.. ఓడిపోయిన వారి బయోపిక్ చూడాలని ఎవరికీ ఆసక్తి ఉండదన్నాడు. 
 
అలాగే సినిమా టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ సన్నీలియోన్ సినిమాలో కౌర్ అనే పదం ఎందుకు వాడారని ప్రశ్నించింది. సిక్కుల మనోభావాలకు భంగం కలిగించేలా ఈ చిత్రానికి కౌర్ అనే పదం వుందని.. అందుచేత ఈ పదాన్ని ఉపయోగించవద్దని కమిటీ ప్రతినిధి దల్జీత్ సింగ్ బేడీ తెలిపారు.
 
సిక్కు గురువులు ఇచ్చిన ''కౌర్'' అనే పదం చాలా పవిత్రమైనదని దల్జీత్ సింగ్ బేడీ పేర్కొన్నారు. సిక్కు బోధనలను పాటించని వారికి ఆ పదాన్ని ఉపయోగించుకునే అర్హత లేదన్నారు. ఈ పదాన్ని ఆమె ఉపయోగించడాన్ని సిక్కులెవరూ హర్షించరన్నారు. సన్నీలియోన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాలీవుడ్ నటి సన్నీలియోన్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన వెబ్ సిరీస్ ''కరణ్‌జిత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్'' టైటిల్‌లో ''కౌర్''ను అంగీకరించే ప్రసక్తే లేదని, తొలగించాలని అల్టిమేటం జారీ చేసింది.
 
ఇదిలా ఉంటే, గత ఏడాది జూలై 16న సన్నీ ఒక చిన్నారిని దత్తత తీసుకుంది. ఆ చిన్నారిని మహారాష్ట్రలోని లాతూర్‌లో సన్నీ దత్తత తీసుకుంది.  సన్నీ తన కుమార్తెకు నిషా అనే పేరుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆ పాపకు ఏడాది నిండిన సందర్భంగా సన్నీలియోన్... తాను, తన భర్త డానియల్ వీబర్, కుమార్తె కలిసివున్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటోతో పాటు భావోద్వేగ కామెంట్ కూడా రాసింది. ''ఈ రోజుతో నీకు ఏడాది పూర్తయ్యింది. నువ్వు నా హృదయం, ఆత్మలో భాగమైపోయావు. ఈ ప్రపంచంలోనే అందమైన అమ్మాయివి'' అంటూ తన భావోద్వేగ సందేశాన్ని రాసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ర‌వితేజ సినిమా ఆగిపోయిందా..?