అడల్ట్ కంటెంట్ తయారీ, ప్రసారం విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాపై ముంబై పోలీసులు తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే.. ఈ కేసులో సాక్షుల జాబితాలో శిల్పాశెట్టి పేరునూ చేర్చారు.
ఈ కేసులో శిల్పాశెట్టి వద్ద పోలీసులు విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తకరమైన విషయాలను వెల్లడించారు. తన భర్త కార్యకలాపాల గురించి తనకు తెలియదని పోలీసులకు స్పష్టం చేశారు.
'నా పనుల్లో నేను చాలా బిజీగా ఉండేదాన్ని. రాజ్‌కుంద్రా ఏం చేసేవాడో నాకు తెలియదు అని వెల్లడించారు. పోలీసులు దాఖలు చేసిన 1,400 పేజీల ఛార్జ్‌షీట్‌లో ఈ విషయాన్ని పొందుపర్చారు. అలాగే అశ్లీల చిత్రాలకు సంబంధించిన యాప్‌ల గురించి కూడా తనకు తెలియదని ఆమె తెలిపారు.
ఈ కేసులో భాగంగా రాజ్ కుంద్రాతో సహా కొంత మంది ఉద్యోగులను జులై 19న పోలీసులు అరెస్టు చేయగా.. వారిలో నలుగురు ఉద్యోగులు అతనికి వ్యతిరేక సాక్షులుగా మారినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా, రాజ్‌కుంద్రాను కోర్టులో విచారిస్తున్న సందర్భంగా తాను తీసిన కంటెంట్ అసభ్యకరం కావచ్చు కానీ అశ్లీలమైనది కాదని ఆయన తెలిపారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఇలాంటి వీడియోలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.