Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బహుమతులు ఇచ్చినందుకే నా సర్వస్వం సమర్పించుకున్నానంటున్న నటి

సినీ ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే నిజాలను కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేస్తారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి తారలు చాలా ఎక్కువగా కనిపిస్తారు. అందులోనూ హీరోయిన్లు. కంగనా రనౌత్ అయితే తనను వాడుకునేందుకు చాలామంది ప్రయత్నాలు చేశారని అప్పట్లో చెప్పి

Advertiesment
sherlyn chopra
, సోమవారం, 30 మే 2016 (18:56 IST)
సినీ ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే నిజాలను కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేస్తారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి తారలు చాలా ఎక్కువగా కనిపిస్తారు. అందులోనూ హీరోయిన్లు. కంగనా రనౌత్ అయితే తనను వాడుకునేందుకు చాలామంది ప్రయత్నాలు చేశారని అప్పట్లో చెప్పి సంచలనం సృష్టించింది. అంతేకాదు... వాళ్ల పేర్లు చెబితే ఏమవుతారో అంటూ సదరు వ్యక్తులకు గుండెల్లో రైళ్లు పరుగెట్టించింది. ఇప్పుడు తాజాగా సెక్సిణి షెర్లిన్ చోప్రా వంతు వచ్చినట్లుంది.
 
ఈమె తాజాగా తనకు సంబంధించిన అనేక విషయాలను వరసబెట్టి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తను కెరియర్ మొదట్లో పలువురు దర్శకనిర్మాతలను నమ్మేసినట్లు చెప్పింది. వాళ్లు తనకు విలువైన బహుమతులు ఇస్తుంటే అవన్నీ తనపై ప్రేమ అని నమ్మేసి తన సర్వస్వాన్ని వారికి అర్పించానని దాచుకోకుండా చెప్పేసింది. 
 
ఐతే కొన్ని రోజుల తర్వాత అసలు వారు తనకు ఇచ్చిన బహుమతులు ఎందుకో అర్థమైందని అంది షెర్లిన్ చోప్రా. ఆ తర్వాత డబ్బు కోసం సర్వస్వాన్ని అప్పగించానని చెప్పిన షెర్లిన్ తనలా చాలామంది హీరోయిన్లు ఇలా మోసపోతూ ఉంటారని చివర్లో చెప్పింది. అంతేకాదు... రంగుల ప్రపంచంలో ఊరేగాలంటే అన్నీ వదిలేసుకోవాల్సిందే అంటోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్మ నోటిదూలకు బ్రేక్.. మహిళా జర్నలిస్టుకు సారీ చెప్పాడు!!