Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వర్మ నోటిదూలకు బ్రేక్.. మహిళా జర్నలిస్టుకు సారీ చెప్పాడు!!

Advertiesment
RGV Targets Female Film Critic. Then Apologises And Blames Trump For It
, సోమవారం, 30 మే 2016 (18:15 IST)
ఇది నిజమా.. ఎప్పుడూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ.. మహిళా జర్నలిస్టుకు సారీ చెప్పాడా? అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. నిజమేనండి..! తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు, రామ్ గోపాల్ వర్మ తొలిసారిగా ఓ మహిళా జర్నలిస్టుకు క్షమాపణ చెప్పాడు. ఇటీవల రిలీజైన హిందీ చిత్రం వీరప్పన్ బాగా లేదంటూ నెగెటివ్ రివ్యూ రాసిన రైటర్స్ వార్తా సంస్థ జర్నలిస్ట్ శిల్పా జామ్ ఖండికర్‌కే వర్మ  సారీ చెప్పాడు. 
 
వీరప్పన్ మూవీపై మిశ్రమ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో.. వీరప్పన్ మీద నెగటివ్ రివ్యూ రాసిన శిల్పాను ఏకిపారేస్తూ వర్మ ట్విట్టర్లో కామెంట్ పోస్ట్ చేశాడు. అంతేగాకుండా.. నీ ముఖమంత అందంగా ఈ సినిమా ఉందంటూ ఆమె ఫోటోను కూడా పోస్టు చేసిన వర్మ.. ఆ తర్వాత సారీ చెప్పాడు. ఆ ఫోటోను తొలగించాడు. ఇంతవరకు ఎవ్వరికీ సారీ చెప్పని రామ్ గోపాల్ వర్మ శిల్పాకు సారీ చెప్పడంపై నోటిదూల వున్న వర్మకు ఇది కావాల్సిందేనని బిటౌన్లో అందరూ అనుకుంటున్నారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని వారు సూచిస్తున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు సినిమాలకు కష్టకాలం.. బ్రహ్మోత్సవం ఫట్.. భిక్షగాడు హిట్.. కారణం ఏమిటి?