Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Advertiesment
Director Pradeep Chilukuri

దేవీ

, సోమవారం, 14 ఏప్రియల్ 2025 (17:32 IST)
Director Pradeep Chilukuri
నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రం అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్  ప్రదీప్ చిలుకూరి పలు విశేషాలు పంచుకున్నారు.
 
అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఆలోచన ఎలా వచ్చింది? 
-కళ్యాణ్ రామ్ గారితో సినిమా చేయాలని ప్రొడ్యూసర్స్ అనుకున్నారు. అప్పటికే కళ్యాణ్ రామ్ గారు డెవిల్ అమిగోస్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసి ఉన్నారు. ముందుగా మాస్ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాము. మాస్ జోనర్ లో హీరో క్యారెక్టర్ ని తయారు చేశాను. తర్వాత ఒక పవర్ఫుల్ మదర్ క్యారెక్టర్ ని అనుకున్నాం. ఈ మదర్ వైజయంతి లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని అనుకున్నాం. ముందు హీరో గారికి చెప్పాం. ఆయన చేద్దాం అన్నారు కానీ విజయశాంతి గారు ఒప్పుకుంటేనే చేద్దాం అని క్లియర్ గా చెప్పారు. విజయశాంతి గారికి కథ చెప్పాం. మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిన్న కరెక్షన్స్ చెప్పారు. ఆ మార్పులు చేసిన తర్వాత సెట్స్ మీద తీసుకువెళ్లాం.  
 
ఇందులో మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ఏమిటి ?
- హీరో క్యారెక్టర్ అండ్ మదర్ క్యారెక్టర్ ఎవరి ఐడియాలజీలో వాళ్ళు కరెక్ట్ గా ఉంటారు. అక్కడి నుంచే కాన్ ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. ఈ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్.
 
మీరు రాజా చెయ్యి వేస్తే సినిమా చేశారు ఆ తర్వాత ఇంత గ్యాప్ రావడానికి కారణం?
- కథలు ఓకే అయ్యాయి. ఒక పెద్ద హీరో సినిమాకి అడ్వాన్స్ లు ఇచ్చి కూడా తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగాం. అలాగే యువీ క్రియేషన్ లో ఒక కథ కోసం మూడేళ్లు పాటు కూర్చున్నాం. అది నెక్స్ట్ చేయబోతున్నాం. అలాగే అనిల్ సుంకర బ్యానర్ లో ఏడాదిన్నర పాటు ఒక కథ మీద వర్క్ చేయడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ అయినా పెద్ద సినిమాలౌతాయి.
 
ఎన్ని ఫైట్స్ ఉన్నాయి ? ఎలా డిజైన్ చేశారు ?
-విజయశాంతి గారి ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ పృథ్వి మాస్టర్ చేశారు.  రామకృష్ణ మాస్టారు ఇంటర్వెల్, క్లైమాక్స్ రెండు ఫైట్లు చేశారు పీటర్ మాస్టర్  హీరో ఇంట్రడక్షన్ క్లైమాక్స్ ఫైట్ చేశారు. విలన్ సీక్వెన్స్ రెండు రఘువరణ్ మాస్టర్ చేశారు. ఫైట్లన్నీ చాలా అద్భుతంగా వుంటాయి.  
 
విజయశాంతి గారు కథని ఒప్పుకున్న తర్వాత కచ్చితంగా భయం కూడా ఉంటుంది కదా?
 కాన్ఫిడెంట్ గా గా చెప్పాం. కాన్ఫిడెన్స్ గా చేశాం. నిజానికి విజయశాంతి గారిని నేనే ఇబ్బంది పెట్టాను. ఇందులో ఒక ఫారెస్ట్ సీక్వెన్స్ ఉంది. ఆ సీన్లో ఓ రెండు గంటల పాటు అడవిలోని బురదలో అలాగే ఉండిపోయారు. షాట్ పూర్తి అయ్యేవరకు అలాగే బురదలో పడుకున్నారు. ఆ సీన్ ఫినిష్ చేసి  కార్వాన్ లోకి వెళ్ళిన తర్వాత  మేడం గారికి ఫుల్ గా జ్వరం వచ్చింది. చేయి వణుకుతుంది. జ్వరం ఉన్నప్పటికీ కూడా ఆ సీన్ అయ్యేవరకు అక్కడ నుంచి కదల్లేదు. అంతా డెడికేటెడ్ గా వర్క్ చేశారు.  మేడం సీనియార్టీ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. ఆవిడ పర్ఫామెన్స్ చూసిన తర్వాత చాలా చోట్ల నాకు గూస్ బంప్స్ వచ్చాయి. వేరే లెవల్లో పెర్ఫార్మన్స్ చేశారు.  కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారు పోటీపడి యాక్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ