వంద రోజుల పాటు కొనసాగా బిగ్ బాస్ మూడో సీజన్‌లో హౌజ్‌లో పార్టిసిపెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. హౌజ్‌లో ఒకరైన శ్రీముఖి.. ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి శ్రీముఖి భారీ ప్లాన్‌తోనే వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ యాంకర్.. తన పేరు మీద శ్రీముఖి ఆర్మీని క్రియేట్ చేసుకొని రంగంలోకి దిగింది. ఇప్పటికే శ్రీముఖి ఒక వీడియోను రిలీజ్ చేసింది.
ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తనను ఎలా అభిమానించారో.. ఇపుడు కూడా ఆ అభిమానాన్ని అలాగే కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది. అంతేగాకుండా తనను అభిమానిస్తున్న వారందరి మద్దతు కావాలంది. ఈ వీడియోను బట్టి చూస్తే బిగ్‌బాస్ 3’హౌస్‌లోకి శ్రీముఖి పెద్ద ప్లాన్‌తోనే ఎంట్రీ ఇచ్చినట్టు అర్థమవుతుంది.
ఇంకా శ్రీముఖి ఆర్మీ పేరిట హౌజ్‌లో అమ్మడు చేసే హావభావాలు, టాస్క్‌లు అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే హిమజను తనకు రీప్లేస్‌మెంట్ ప్రకటించే క్రమంలో కప్ గెలుచుకోవాలనే ఆశ అందరికీ వుంటుందని.. తనకు బిగ్ బాస్ కప్ కొట్టాలనుందని చెప్పింది. దీన్ని బట్టి శ్రీముఖి తప్పకుండా బిగ్ బాస్ కప్ కొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుందని టాక్ వస్తోంది. ప్రస్తుతం శ్రీముఖి టీమ్ అనే హ్యాష్‌ట్యాగ్ వైరల్ అవుతోంది.