Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'అర్జున్ రెడ్డి'లో నటించలేదని బాధపడుతున్నానంటున్న హీరో

"అర్జున్ రెడ్డి"... తెలుగు సినీపరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసిన సినిమా. చిన్న సినిమా ఏం హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ సినిమాకు వచ్చిన పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. కాలేజీ కుర్రకారు ఎగబడి మరీ స

Advertiesment
'అర్జున్ రెడ్డి'లో నటించలేదని బాధపడుతున్నానంటున్న హీరో
, సోమవారం, 2 అక్టోబరు 2017 (17:12 IST)
"అర్జున్ రెడ్డి"... తెలుగు సినీపరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసిన సినిమా. చిన్న సినిమా ఏం హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ  ఆ సినిమాకు వచ్చిన పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. కాలేజీ కుర్రకారు ఎగబడి మరీ సినిమా చూశారు. అది కూడా ఒకటి రెండు సార్లు. ఒక్కొక్కర్లు ఐదారుసార్లకు పైగా ఈ సినిమాను చూశారు. మెసేజ్‌తో పాటు కథా, కథనం యువతీ, యువకులను బాగా ఆకట్టుకుంది. కొన్ని సీన్లు జుగుస్సాకరంగా ఉన్నా యూత్ మాత్రం బాగానే ఎంజాయ్ చేశారు.
 
'అర్జున్ రెడ్డి' సినిమాలో విజయ్ దేవరకొండకు బదులు మొదటగా అవకాశం వచ్చింది శర్వానంద్‌కు. ఈ విషయం చాలామందికి తెలియదు. నిర్మాత ప్రణయ్ రెడ్డి, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలు బంధువులు. మొత్తం డబ్బులను ఖర్చు పెట్టింది సందీప్ రెడ్డే. నిర్మాత, దర్శకుడు ఒక్కరే అవ్వడంతో శర్వానంద్ 'అర్జున్ రెడ్డి' సినిమాలో నటించేందుకు ఒప్పుకోలేదు. 
 
రెండూ ఒకరే చేస్తే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సినిమా సరిగ్గా రాకపోవచ్చు. అందుకే నేను ఆ సినిమాలో నటించనని చెప్పా.. కానీ సినిమా భారీ హిట్ అయ్యింది. విజయ్ దేవరకొండ నటన చాలా అద్భుతంగా ఉందంటూ శర్వానంద్ ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో పొగడ్తలతో ముంచెత్తారు. ఆ సినిమాలో అవకాశమొస్తే వద్దనుకున్నా.. కానీ ఇప్పుడు బాధపడుతున్నా.. ఆ సినిమాలో ఎందుకు నటించలేదని ఇపుడు అనుకుంటున్నట్టు శర్వానంద్ వాపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు ఆ హీరోతో చేయాలని ఉంది : మెహ్రీన్