Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవకాశాలు కావాలంటే దర్శకనిర్మాతల కోరికలు తీర్చాల్సిందే...

Advertiesment
Shama Sikander
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (10:53 IST)
Shama Sikander
ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం కొనసాగుతూనే వుంది. ఈ మీటూ ఉద్యమంలో ఎంతోమంది హీరోయిన్లు వారి జీవితంలో ఎదురకొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. తాజాగా బాలీవుడ్‌కి చెందిన నటి షామా సికిందర్ కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ జీవితంలో తనకు ఎదురైనా ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.
 
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ఇంతకుముందు ఉన్న విధంగా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఆ విధంగా లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ చాలా ప్రొఫెషనల్‌గా ఉంటున్నారు. 
 
హీరోయిన్లకు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీ చాలా సేఫ్‌గా ఉంది అని చెప్పవచ్చునని వెల్లడించింది. అయితే ఒకప్పుడు దర్శక నిర్మాతలు హీరోయిన్లను వారితో గడపాలని ఇబ్బంది పెట్టేవారు అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. కాగా అప్పట్లో చాలామంది పేరు ఉన్న దర్శక నిర్మాతలు వారితో పని చేయకపోయినా కూడా తమతో సన్నిహితంగా ఉండాలని అడిగేవారు అని చెప్పుకొచ్చింది షామా.
 
"నీకు పని కావాలంటే మాతో చనువుగా ఉండాలి. మాతో బెడ్‌ షేర్‌ చేసుకోవాలని చెప్పేవారు. అప్పటి హీరోయిన్లు అంతా ఇండస్ట్రీలో అభద్రతా భావంతో ఉండేవారు. అవకాశాలు కావాలంటే దర్శకనిర్మాతల కోరికలు తీర్చాల్సిందే. అలా చేస్తేనే అవకాశాలు ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. అలా అని ప్రస్తుతం ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ లేదని చెప్పను. ఉంది. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువగా ఉంది" అని చెప్పుకొచ్చింది షామా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్ సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. జూలై నుంచి అమలు