Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శాకిని డాకిని - గా రెజీనా, నివేదా థామస్

శాకిని డాకిని - గా రెజీనా, నివేదా థామస్
, బుధవారం, 3 నవంబరు 2021 (17:43 IST)
Regina, Niveda Thomas
`ఓ బేబీ` వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో  రూపొందుతున్న రెండో చిత్రం `శాకిని డాకిని`. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
 
నివేదా థామస్ పుట్టిన రోజు సందర్భంగా నేడు (నవంబర్ 2) ఈ చిత్రం టైటిల్‌  పోస్టర్‌ను విడుదల చేశారు. శాకిని డాకిని టైటిల్ ఆసక్తికరంగా ఉండడంతో ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం విశేషం.
 
ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది.
 
సాంకేతిక బృందంః  డైరెక్టర్: సుధీర్ వర్మ,  అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్:  అక్షయ్ పుల్ల, నిర్మాతలు : డి సురేష్ బాబు, సునిత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్, సినిమాటోగ్రఫి: రిచర్డ్ ప్రసాద్, సంగీతం: మిక్కీ మెల్క్రెరీ, ఎడిటర్:  విప్లవ్ నైషధం, లైన్ ప్రొడ్యూసర్:  విజయ్ శంకర్ దొంకడ, ఆర్ట్ డైరెక్టర్ : గాంధీ నడికుడికర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరీ రాజిష విజయన్? ఎలా సినిమాల్లోకి తీసుకువచ్చారంటే..?