Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ నాలుగు చిత్రాలను కూడా షారూక్ ఖాన్ 'పఠాన్' బీట్ చేస్తుందా?

Advertiesment
pathaan movie still
, బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (12:48 IST)
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటించిన తాజా చిత్రం "పఠాన్". ప్రియాంకా చోప్రా హీరోయిన్. ఆనంద్ సిద్ధార్థ్ దర్శకత్వం వహించారు. గత నెలలో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లో సక్సెస్ సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది. 
 
ఫలితంగా చిత్రం విడుదలైన 27 రోజుల్లోనే ఏకంగా రూ.1000 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా సాధించిన ఈ కలెక్షన్లతో పలు రికార్డులు మాయమైపోయాయి. అదేసమయంలో మరో నాలుగు చిత్రాలు సాధించిన చిత్రాల కలెక్షన్లకు సమీపానికి వెళుతుంది. దీంతో ఈ చిత్రం కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డు నెలకొల్పుతుందని చిత్ర బృందం గట్టి నమ్ముతోంది.
 
గతంలో అమీర్ ఖాన్ నటించిన "దంగల్" చిత్రం రూ.1914 కోట్లు సాధించగా, ఆ తర్వాతి స్థానంలో "బాహుబలి-2" చిత్రం రూ.1747 కోట్లు, "కేజీఎఫ్ చాప్టర్ 2" రూ.1188 కోట్లు, "ఆర్ఆర్ఆర్" రూ.1174 కోట్లు చొప్పున కలెక్షన్లు రాబట్టింది. ఇందులో టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన రెండు చిత్రాలు ఉండటం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ సినిమా బడ్జెట్ రూ.1000 కోట్లు... 30 భాషల్లో రిలీజ్‌కు ప్లాన్?