షారూఖ్‌కు మోకాలి నొప్పి.. మేజర్ సర్జరీ చేస్తారట.. సన్నీలియోన్ ట్వీటుకు షారూఖ్ స్వీట్ రిప్లై..
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తీవ్ర మోకాలి నొప్పితో బాధపడుతున్నారని, ఆయనకు మేజర్ ఆపరేషన్ చేయనున్నారని తెలిసింది. ఇటీవల జరిగిన 'రాయిస్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి కూడా షారుఖ్ 'నీ బ్యాండ్' తోనే వచ్చాడు
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తీవ్ర మోకాలి నొప్పితో బాధపడుతున్నారని, ఆయనకు మేజర్ ఆపరేషన్ చేయనున్నారని తెలిసింది. ఇటీవల జరిగిన 'రాయిస్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి కూడా షారుఖ్ 'నీ బ్యాండ్' తోనే వచ్చాడు. గత కొన్ని నెలలుగా మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న షారూఖ్ ఖాన్‌కు మే నెలలో ఒక ఆపరేషన్ నిర్వహించారు.
అయినా, పరిస్థితి ఏమాత్రం మారకపోవడంతో.. మరోసారి సర్జరీ జరగనుందని షారుఖ్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్లు తెలిపారు. అయితే ముందులా ఆపరేషన్‌కు తర్వాత షూటింగ్‌ల్లో పాల్గొనకకుండా షారూఖ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఇదిలా ఉంటే.. మస్తీజాదే సినిమాతో కుర్రకారును మత్తెక్కించిన బాలీవుడ్ శృంగార తార మరోసారి ప్రేక్షకులను పలకిరించేందుకు సిద్ధమవుతోంది. అయితే సన్నీ ఈ సారి పుల్ లెంగ్త్ రోల్‌లో కాకుండా ఐటెంభామగా తెరమీద కనిపించబోతోంది.
షారూఖ్ ఖాన్ నటించిన రాయీస్ మూవీలో సన్నీ లియోన్, షారూఖ్‌తో కలిసి చిందులేయనుంది. ఫిరోజ్ ఖాన్, జీనత్ అమన్ నటించిన ఖుర్బానీ సినిమాలోని లైలా ఓ లైలా సాంగ్‌ని కొత్తగా మార్చి రాయీస్ మూవీలో పెట్టారు. ఈ పాటలో షారూఖ్ ఖాన్, సన్నీలియోన్ తళుక్కుమన్నారు.
ఈ నేపథ్యంలో ఈ పాటకు సంబంధించిన కొంత పార్టును సన్నీ ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తే.. ఈ ట్వీట్‌కు షారూఖ్ స్పందించాడు. ఈ ట్వీట్‌కి షారూఖ్ స్వీట్ రిప్లై ఇచ్చారు. సో స్వీట్ అని ట్వీట్ చేయడంతో సన్నీ ఎగిరిగంతేస్తోంది.