కన్ఫామ్.. జయలలిత సాక్షిగా విఘ్నేష్‌తో నయనతార బంధానికి క్లారిటీ ఎలా?
దక్షిణాది అగ్రతార నయనతార ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్‌తో సహజీవనం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. గతంలో హీరో శింబు, దర్శకనటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో నయన్ ప్రేమాయణం నడిపింది. కానీ ప్రభుదేవాతో పెళ్ళ
దక్షిణాది అగ్రతార నయనతార ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్‌తో సహజీవనం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. గతంలో హీరో శింబు, దర్శకనటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో నయన్ ప్రేమాయణం నడిపింది. కానీ ప్రభుదేవాతో పెళ్ళాగి పోవడంతో మళ్లీ సినిమాల్లో పుంజుకున్న నయనతార, తాజాగా.. దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో నయన్ కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. వీళ్లిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి కూడా చేసుకున్నారని కోలీవుడ్‌లో పెద్ద చర్చే నడుస్తుంది. ఇందుకు ఆధారంగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
తాజాగా నయనపై మరో ఆసక్తికరమైన విషయం కోలీవుడ్‌లో హల్ చల్ చేస్తోంది. చెన్నైలోని ఎగ్మూర్ ప్రాంతంలో ఇటీవలే ఖరీదైన ఇంటిని నయనతార కొందట. ఈ ఇంట్లోనే విఘ్నేశ్‌తో నయనతార సహజీవనం చేస్తోందని తెలిసింది. కానీ పెళ్లి కాకుండానే నయన- విఘ్నేష్ సహజీవనం మొదలు పెట్టారా? అనే విషయంలో మాత్రం కొంచెం డివైడ్ టాక్ వినిపిస్తుంది.
అయితే.. నయన జయలలితకు నివాళులు అర్పించేందుకు వచ్చి వేలాది మంది సమక్షంలో ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లు అయింది. జయలలిత పార్ధివ దేహాన్ని దర్శించుకోవడానికి అనేకమంది సినిమా సెలబ్రిటీలు క్యూలు కట్టిన నేపథ్యంలో.. బెంగళూరులో షూటింగ్‌లో ఉన్న నయనతార కూడా అర్ధాంతరంగా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ చెన్నై వచ్చింది.
జయలలిత మృతదేహానికి తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నివాళులు అర్పించింది. ఇద్దరూ కూడా తెల్ల బట్టల్లో వచ్చారు. దీనిని బట్టి నయన విఘ్నేష్‌ల మధ్య రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అని కోలీవుడ్ జనం చెవులు కొరుక్కుకుంటున్నారు.