Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీతారామశాస్త్రి గారి ప్ర‌స్థానం - ఆర్‌.ఆర్‌.ఆర్‌లో దోస్తీ పాట- నానికి చివ‌రి పాట‌

సీతారామశాస్త్రి గారి ప్ర‌స్థానం - ఆర్‌.ఆర్‌.ఆర్‌లో దోస్తీ పాట- నానికి చివ‌రి పాట‌
, మంగళవారం, 30 నవంబరు 2021 (18:10 IST)
Sirivennela Seetharama Sastry
సిరివెన్నెల సీతారామశాస్త్రి పుట్టినతేదీ 20 మే, 1955.. ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లిలో జన్మించారు. సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీ గీత రచయిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు. తన ఉత్తమ విమర్శకురాలిగా తన భార్య 'పద్మావతి'ని పేర్కొనే సీతారామశాస్త్రి తన గురువుగా శ్రీ వై. సత్యారావు'ని చెబుతారు. ప్ర‌స్తుతం ఆయ‌న 66వ ఏట హైద‌రాబాద్‌లోని ఆసుప‌త్రిలో ఊపిరితిత్తుల స‌మ‌స్య‌తో కాలం చేశారు.
 
సిరివెన్నెల 1986లో విడుదలైన శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న తెలుగు చలన చిత్రం. కళాతపస్వి కె.విశ్వనాథ్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఏడిద నాగేశ్వరరావు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు.

webdunia
Nani-seetaramasastry
నాని నివాళి
సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి గారు చివ‌ర‌గా నాని హీరోగా న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్ సినిమాలో రెండు పాట‌లు రాయ‌డం జ‌రిగింది. అవే అత‌ని చివ‌రి పాట‌లు కావ‌డం విషాద‌క‌రం. ఆయన సాహిత్యం లోని సిరివెన్నెల మన మనసుల మీద ఎప్పటికీ అలానే వుంటుంది. వీడుకోలు గురువు గారూ అంటూ నాని నివాళుల‌ర్పించారు.
 
- 1984లో బాలకృష్ణ హీరోగా వచ్చిన జననీ జన్మభూమి సినిమాతో కెరీర్ ప్రారంభం. చంబోలు సీతారామశాస్త్రిగా ప్రేక్షకులకు పరిచయం..కె.విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాతో గుర్తింపు.. అదే సినిమా ఇంటిపేరుగా మారిపోయింది..
 
- సిరివెన్నెల సినిమాతో అవార్డులు సొంతం చేసుకున్న సీతారామశాస్త్రి.. దర్శకుడు కె.విశ్వనాధ్‌తో అన్ని సినిమాలకు పనిచేసిన సిరివెన్నెల..అందుకే కె.విశ్వనాథ్ ఆయనను ప్రేమగా సీతారాముడు అని పిలుస్తాడు.
 
- దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు అల్లుడు. 
 
- రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, కె.విశ్వనాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి దర్శకులందరూ సిరివెన్నెల పాట లేకపోతే సినిమా చేయరు..
 
- 2019లో పద్మశ్రీ వచ్చింది.. కెరీర్లో ఉత్తమ గేయరచయితగా 11 నంది అవార్డులు.. నాలుగు ఫిలింఫేర్..
 
- ఈ మధ్య వెంకటేష్ నారప్ప, కొండపొలం సినిమాలో పాటలు రాశారు..
 
- త్రిబుల్ ఆర్ సినిమాలో దోస్తీ పాట రాసింది సిరివెన్నెల సీతారామశాస్త్రి..
 
- తెలుగు ఇండస్ట్రీలో హీరోలందరితో కలిసి పనిచేసిన సిరివెన్నెలగారు మురారి సినిమాలో పెళ్లి పాట అలనాటి రామచంద్రుడు అన్నింటా సాటిలా నిలిచింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నమ్మకు నమ్మకు ఈ రేయినీ.. అంటూ కానరాని లోకాలకు సిరివెన్నెల