వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం బాలీవుడ్ హాట్ హీరోయిన్ రాధికా ఆప్టేపై పడ్డాడు. నిన్న కేవలం ఒకే ఒక చొక్కాను తొడిగి అందాలను ఆరబోస్తూ ఫోజిచ్చిన రాధికా ఆప్టేపై వర్మ ట్విట్టర్లో స్పందించారు. గత మూడు జన్మల్లో ఎక్కడా ఇలాంటి అందాన్ని చూడలేదని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే వర్మపై పగ తీర్చుకునే సాహసం చేసింది రాధికా ఆప్టే.
''హేయ్ రాధికా ఆప్టే నువ్విలా పగ తీర్చుకుంటుంటే.. మాలాంటి పేద మగవారు ఏం చేయాలి?" అంటూ వర్మ ట్వీట్ చేశారు. దానితో పాటు ఓ పోస్టర్‌ని కూడా రామ్ గోపాల్ వర్మ పోస్టు చేశాడు. ఫెమినా మేగజైన్ మే నెల ఎడిషన్ కవర్ పేజ్‌పై ఉన్న రాధికా ఆప్టే ఫోటో అది. పింక్ కలర్ సూట్ వేసుకుని చిన్న షార్ట్‌తో మోకాళ్లపై కూర్చున్న రాధిక దర్శనమిస్తుంది. ఈ భామకి వేసిన మేకప్ కాంబినేషన్ కూడా డిఫరెంట్‌గా ఉంది.
ఇప్పటికే ఓసారి ఇలాంటి అందగత్తెను తాను 3 జన్మల్లో చూడలేదని పొగిడిన వర్మ.. ప్రస్తుతం మాపై పగబట్టేసిందని తెలిపాడు. ఈ వరుస ట్వీట్ల హంగామా చూస్తుంటే.. రాధికా ఆప్టేకి వర్మ బాగానే కనెక్ట్ అయినట్లుగా అనిపిస్తోంది. అందుకే ఇలా వరుసగా రాధికపై ట్వీట్స్ వేస్తున్నాడు. ఇదంతా తన సినిమాలో హీరోయిన్‌గా చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.