Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సత్య మూవీ అచ్చమైన తెలుగు సినిమాలా ఉంటుంది : నిర్మాత శివమల్లాల

Advertiesment
Satya - Producer Sivamallala

డీవీ

, గురువారం, 9 మే 2024 (17:24 IST)
Satya - Producer Sivamallala
తమిళంలో హిట్ కొట్టిన రంగోలి మూవీ తెలుగులో మే 10న సత్య గా విడుదల కాబోతోంది.  హమరేష్, ప్రార్ధన జంటగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన రంగోలి సినిమాని శివం మీడియా పై శివమల్లాల గారు నిర్మాతగా తెలుగులో తీసుకొస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన చెప్పిన విశేషాలు.
 
- నేను చెన్నై వెళ్ళినప్పుడు నా స్నేహితుడి ద్వారా సతీష్  పరిచయమయ్యారు. ఆయన తమిళ్ నిర్మాత హీరో హమరేష్ కి తండ్రి.  ఆయనతో పెరిగిన స్నేహం కొద్దీ తెలుగులో మీ రివ్యూలు బాగుంటాయి అని ఈ సినిమాని స్పెషల్ స్క్రీనింగ్ వేయించి నాకు చూపించారు. సినిమా చూసిన తర్వాత బాగా కనెక్ట్ అయ్యాను కానీ క్లైమాక్స్ ఎక్కలేదు. దాదాపు 45 నిమిషాల పాటు డైరెక్టర్ తో క్లైమాక్స్ గురించి వాదించాను. సతీష్ గారికి క్లైమాక్స్ బాలేదండి సినిమా అంతా బాగుంది అని చెప్పాను. అది ఇంకా రఫ్ వెర్షన్ మాత్రమే. మళ్లీ రెండు నెలల తర్వాత కాల్ చేసి సినిమా రిలీజ్ కి అక్కడున్న పెద్ద దర్శకులు నిర్మాతలతో మళ్లీ చూపించారు. సినిమా గురించి మాట్లాడమని నన్ను స్టేజ్ పైకి ఆహ్వానించారు. అప్పుడే ఈ సినిమాని తెలుగులో నేను రిలీజ్ చేస్తాను అని అనౌన్స్ చేయడం జరిగింది. అలా ఈ సినిమా నాకు ఒక బేబీ లాగా అయిపోయింది. ఈ సినిమా డబ్బింగ్ కోసం కాంప్రమైజ్ అవ్వకుండా 12 లక్షలు ఖర్చు పెట్టాం. అచ్చమైన తెలుగు సినిమా లాగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం.
 
- సీడెడ్ లో  28 థియేటర్లు డబ్బింగ్ సినిమాకి అది చాలా ఎక్కువ థియేటర్ల కింద లెక్క. ఇక్కడ మటుకు నేనే డిస్ట్రిబ్యూటర్ గా పివిఆర్, ఐనాక్స్, సినిమాక్స్ లాంటి థియేటర్స్ మాట్లాడుకుని ఏ విధంగా విడుదల చేయాలో నేనే ప్లాన్ చేసుకొని చేస్తున్నాను.
 
- తమిళ్ వెర్షన్ కి తెలుగు వర్షన్ కింద క్లైమాక్స్ ని ముందే డైరెక్ట్ చేసి పెట్టుకున్నారు. తమిళ్ క్లైమాక్స్ అంత వర్కౌట్ అవదు తెలుగులో అని సతీష్ గారితో అన్నప్పుడు తెలుగులో క్లైమాక్స్ రీ షూట్ చేద్దాం అన్న  అన్నిటికీ ఓకే అన్నారు. కానీ ఆ 5 మినిట్స్ క్లైమాక్స్ వెర్షన్ ముందే షూట్ చేసి ఉండటం వల్ల దానికి ప్రాపర్ డబ్బింగ్ చెప్పించి తెలుగులో క్లైమాక్స్ మార్చి తీసుకొస్తున్నాం.
 
- ఈ సినిమాకి హైలెట్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్. గవర్నమెంట్ స్కూల్ లో చదువుకునే స్టూడెంట్ ని తీసుకెళ్లి బావి లాగా ఉండే ప్రైవేట్ స్కూల్లో వేస్తే. ఆ తండ్రికి కొడుక్కి మధ్య జరిగిన సిచువేషన్స్ చాలా బాగుంటాయి. ఈ సినిమాలో చదువు ఒకటి ఫాదర్స్ అండ్ రిలేషన్షిప్ అనే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి ఫ్రెండ్షిప్ ఉంటుంది. నార్మల్ గా నేను సినిమా చూసి బాలేక పోతే బాలేదు లైట్ తీసుకోండి అని చెబుదామనుకున్నా కానీ కొత్త కుర్రాడు అయినా హమరేష్ చాలా బాగా నటించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విష్ణు మంచు నటిస్తున్న కన్నప్ప సెట్‌లో అడుగు పెట్టిన ప్రభాస్