Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ తో అలరిస్తున్న దర్శిని చిత్రం ట్రైలర్

Vikas, Shanti

డీవీ

, శుక్రవారం, 3 మే 2024 (16:54 IST)
Vikas, Shanti
వికాస్, శాంతి హీరో హీరోయిన్ గా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం లో డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మించిన సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ చిత్రం "దర్శిని". ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. వి 4 సినీ క్రియేషన్స్ పతాకం పై రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్రం  థియేట్రికల్ ట్రైలర్ ను కె ఎల్ దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు. ట్రయిల్ అలరిస్తోంది. 
 
webdunia
Vikas, Shanti, KL Damodar Prasad and others
కె ఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ "రెండున్నర సంవత్సరాల క్రితం ఈ దర్శిని టీం వాళ్ళు ఫిలిం ఛాంబర్ దగ్గర నన్ను కలిశారు. ఉన్నత చదువులు చదివి డాక్టరేట్ పొంది ప్రొఫెస్సర్స్ గా రాణించి ఇప్పుడు దర్శిని అనే ఒక సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ చిత్రం తో చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. నన్ను మొదటి పోస్టర్ ను విడుదల చేయమన్నారు. వైజాగ్ లో ఒక ఈవెంట్ లో దర్శిని చిత్ర మొదటి పోస్టర్ ను విడుదల చేశాను. తర్వాత వీళ్ళ ప్యాషన్ నచ్చి సినిమా చూసాను, కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తక్కువ బడ్జెట్ లో చాలా మంచి సినిమా తీశారు. త్వరలో విడుదల కాబోతుంది, విజయం సాధించాలి" అని కోరుకున్నారు.
 
నిర్మాత డాక్టర్ ఎల్ వి సూర్యం మాట్లాడుతూ "మాకు ఈ సినిమా ఫీల్డ్ కొత్త, కానీ సినిమా మీద ఉన్న ప్యాషన్ తో దర్శిని చిత్రాన్ని నిర్మించాం. ఈ ప్రయాణంలో మాకు బాగా సపోర్ట్ గా నిలిచిన మొదటి వ్యక్తి కె ఎల్ దామోదర్ ప్రసాద్ గారు. మాకు సపోర్ట్ గా నిలిచిన దామోదర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. మా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పని చేసాడు. మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. ఈ దర్శిని చిత్రంలో మూడు ముఖ్య పాత్రలు, జీవితం మీద అసంతృప్తిగా ఉన్న ముగ్గురు కి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనేదే మా చిత్ర కథ. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కామెడీ, ఎమోషన్, లవ్ అని అంశాలు మా చిత్రాల్లో ఉన్నాయి. మే నెలలో విడుదల చేస్తాం" అని తెలిపారు.
 
దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు మాట్లాడుతూ "కె ఎల్ దామోదర్ ప్రసాద్ గారు మా గాడ్ ఫాథర్. మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. మా నిర్మాత, మా కో డైరెక్టర్, మా హీరో, హీరోయిన్ మేము అందరం ఇప్పుడు ఒక ఫామిలీ. అందరం సొంత సినిమా గా పని చేసాం. సినిమా చాలా బాగా వచ్చింది, మే నెలలో విడుదల అవుతుంది. అందరికి నచ్చుతుంది" అని కోరుకున్నారు.
 
హీరో వికాస్ మాట్లాడుతూ "మా చిత్రానికి పునాది మా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు. ఈ జర్నీ లో చాలా కష్టాలు చూసాము కానీ సినిమా మీద ప్యాషన్ తో కష్టపడి పని చేసాము. సినిమా చాలా బాగా వచ్చింది, త్వరలో విడుదల అవుతుంది" అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హర హర మహాదేవ్ అంటూ కన్నప్ప షూట్ పూర్తి చేసిన అక్షయ్ కుమార్