Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

'సత్య గ్యాంగ్‌' సినిమా చూసి నచ్చలేదన్నవారికి డబ్బులు వాపసు ఇచ్చేస్తారట...

సమాజంలో అనాధలనేవారు లేకుండా చేయాలనే సందేశానికి వినోదాన్ని జోడించి రూపొందిన చిత్రం 'సత్య గ్యాంగ్‌'. ఈ చిత్రం టీజర్‌ను అనాధ బాలల సమక్షంలో వారే అతిథులుగా విడుదల చేశారు. అంతేకాదు, వారికి 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు చిత్ర నిర్మాత మహేష్‌ ఖన్నా. సాత

Advertiesment
Satya gang
, సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (18:28 IST)
సమాజంలో అనాధలనేవారు లేకుండా చేయాలనే సందేశానికి వినోదాన్ని జోడించి రూపొందిన చిత్రం 'సత్య గ్యాంగ్‌'. ఈ చిత్రం టీజర్‌ను అనాధ బాలల సమక్షంలో వారే అతిథులుగా విడుదల చేశారు. అంతేకాదు, వారికి 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు చిత్ర నిర్మాత మహేష్‌ ఖన్నా. సాత్విక ఈశ్వర్‌ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై మహేష్‌ ఖన్నా నిర్మిస్తున్న చిత్రం 'సత్య గ్యాంగ్‌'. ప్రభాస్‌ దర్శకత్వం వహించారు. షూటింగ్‌ పూర్తయి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులన్నీ ముగించుకున్న ఈ చిత్రం టీజర్‌ని ఫిలిం ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. 12 మంది అనాధ బాలులు టీజర్‌ను విడుదల చేశారు.
 
అనంతరం మహేష్‌ ఖన్నా మాట్లాడుతూ.. 'సమాజంలో అనాధలనేవారు ఉండకూడదనే సందేశానికి వినోదాన్ని మేళవించి తీస్తున్న చిత్రం 'సత్య గ్యాంగ్‌'. అందుకే అనాధ బాలల చేతుల మీదుగా టీజర్‌ లాంచ్‌ చేశాం. హీరోగా పరిచయమవుతున్న సాత్విక్‌ ఈశ్వర్‌‌కి చాలా మంచి భవిష్యత్‌ ఉంది. త్వరలోనే ఆడియో లాంచ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. దర్శకుడిగా పరిచయమవుతున్న ప్రభాస్‌ ప్రతి ఫ్రేమ్‌ అందంగా తీర్చి దిద్దాడు. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా చూసి నచ్చలేదన్నవారికి డబ్బులు వాపసు ఇచ్చేస్తాం. సినిమాపై అంత నమ్మకముందని అన్నారు. 
 
ఇటువంటి చిత్రానికి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు దర్శకుడు తెలియజేశారు. చక్కటి సందేశంతో కూడిన చిత్రం ద్వారా పరిచయం అవ్వబోతుండడం అదష్టంగా భావిస్తున్నామని సాత్విక్‌ ఈశ్వర్‌, ప్రత్యూష్‌, అక్షిత అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'తొలిప్రేమ'కు 100 మార్కులు వేసిన దర్శకధీరుడు