ఒక టిక్కెట్ కొంటే మరో టిక్కెట్ ఫ్రీ... 'కాటమరాయుడు' పని అయిపోయినట్టేనా?
పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్రానికి టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు వచ్చేస్తున్నాయి. అత్తారింటికి దారేది చిత్రాన్ని వసూళ్లు విషయంలో దాటేస్తుందని అంటున్నారు. మరోవైపు కాటమరాయుడు చిత్రంపై సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. వీకెండ్ కావడంతో కాటమరాయుడు థియేటర్ల
పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్రానికి టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు వచ్చేస్తున్నాయి. అత్తారింటికి దారేది చిత్రాన్ని వసూళ్లు విషయంలో దాటేస్తుందని అంటున్నారు. మరోవైపు కాటమరాయుడు చిత్రంపై సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. వీకెండ్ కావడంతో కాటమరాయుడు థియేటర్లు ఈగలు తోలుకుంటున్నాయని అంటున్నారు. ఓవర్సీస్ లో అయితే పరిస్థితి మరోలా వున్నదట.
రెండు టిక్కెట్లు కొన్నవారికి ఓ టిక్కెట్ ఫ్రీ అంటూ థియేటర్ యజమానులు సందేశాలను పంపిస్తున్నారట. దీనితో చిత్రాన్ని చూసేందుకు కాస్త రద్దీ ఎక్కువయిందట. రెండు టిక్కెట్లు కొంటే ఓ టిక్కెట్ ఫ్రీ అనేది ప్రస్తుతం ఒక టిక్కెట్ కొంటే మరో టిక్కెట్ స్థాయికి పడిపోయిందట. దీన్ని చూసిన పవన్ వ్యతిరేక వర్గం కాటమరాయుడు స్టామినా ఇంతేనన్నమాట అని సెటైర్లు విసురుతున్నారు.