Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పీకే ఫ్యాన్స్ చదువులేని గొర్రెలు.. నేనెప్పుడో చనిపోయా.. నేను దెయ్యాన్ని.. దెయ్యాలకు మరణం లేదు..

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పవన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన రామ్ గోపాల్ వర్మను చంపేశారు. రాంగోపాల్ వ

పీకే ఫ్యాన్స్ చదువులేని గొర్రెలు.. నేనెప్పుడో చనిపోయా.. నేను దెయ్యాన్ని.. దెయ్యాలకు మరణం లేదు..
, బుధవారం, 29 మార్చి 2017 (13:02 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పవన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన రామ్ గోపాల్ వర్మను చంపేశారు. రాంగోపాల్ వర్మ చచ్చిపోయాడు. వర్మ మరణంతో సినీ పరిశ్రమకు పట్టిన పీడ విరగడ అయిందని, పలువురు హర్షం వ్యక్తం చేస్తూ పోస్టర్‌ని క్రియేట్ చేశారు. ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారంటూ ఒక పోస్టర్ కి క్రియేట్ చేశారు. 
 
ఈ పోస్టర్ చూసిన రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ‘లవ్యూ టూ మై డియర్ స్వీట్ డార్లింగ్ లవ్లీ బ్యూటీఫుల్ క్యూట్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. మీ అందరికీ ఒక పెద్ద హగ్’ అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు పవన్ అభిమానులను చదవు సంధ్య లేని గొర్రెలతో పోల్చాడు. ‘చదువులేని గొర్రెలు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. మూడు జన్మలకు ముందే నేను చనిపోయా. ప్రస్తుతం నేను ఒక దెయ్యాన్ని. దెయ్యాలకు మరణం లేదు. చావులోనే అవి బతికుంటాయ్’ అంటూ ట్విట్టర్ లో కామెంట్ చేశాడు.
 
పవన్ ఫ్యాన్స్‌కు ఝలక్ ఇచ్చి.. పనిలో పనిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఏకిపారేశాడు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ను ఎన్నుకోవడమే తమ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అనే విషయాన్ని అక్కడి ప్రజలు నిదానంగా గ్రహిస్తున్నారని నేను అనుకుంటున్నాను’ అని వర్మ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 
 
కాగా, వర్మ చేసిన ఈ ట్వీట్ లో మరో ప్రత్యేకత ఉంది. ఈ ట్వీట్ కు మొత్తం 17 పదాలను వర్మ ఉపయోగించారు. అందులో మొదటి, నాలుగు, పది, పదిహేను పదాలను మినహాయిస్తే, మిగిలిన 13 పదాల్లో మొదటి అక్షరం లేకుండా ఈ ట్వీట్ చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వీటీ బరువు తగ్గలేదు.. రాజమౌళికి తలనొప్పి.. నిర్మాతలకు రూ.20కోట్ల ఖర్చు?!