'కొదమసింహం' - 'సమరసింహం'ల మధ్య చిట్టెలుక... 'శతమానం భవతి' కలెక్షన్స్ అదుర్స్
సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణల చిత్రాలతో పోటీపడిన చిత్రం "శతమానంభవతి". శర్వానందం నటించిన ఈ చిత్రంలో శర్వానంద్ హీరో. సతీష్ వేగ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్
సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణల చిత్రాలతో పోటీపడిన చిత్రం "శతమానంభవతి". శర్వానందం నటించిన ఈ చిత్రంలో శర్వానంద్ హీరో. సతీష్ వేగ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్ సరసన అనుపమపరమేశ్వరన్ జతకట్టింది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్ర హీరో కొదమసింహం - సమరసింహంల మధ్య చిట్టెలుకలా దూరి తన చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రం కూడా చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల తరహాలోనే మంచి విజయాన్ని అందుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలించిన "ఖైదీ నెం.150", "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తున్నాయి. ఈ సంక్రాంతికి రిలీజైన మరో చిత్రం 'శతమానంభవతి' కూడా సూపర్ హిట్ అనిపించుకొంది. కేవలం 3 రోజుల్లోనే ఈ చిత్రానికి పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేసింది. నాలుగో రోజు నుంచి వచ్చే వసూళ్లని లాభాలేనని స్వయంగా నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. 5 రోజుల్లో శతమానం భవతి దాదా రూ.12 కోట్ల షేర్‌ని రాబట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సాధించిన కలెక్షన్లను పరిశీలిస్తే...
* నైజాం - రూ.3.99 కోట్లు
* సీడెడ్ - రూ.1.36 కోట్లు
* ఉత్తరాంధ్ర - రూ.2.15 కోట్లు
* వెస్ట్ గోదావరి - రూ. 1.04 కోట్లు
* ఈస్ట్ గోదావరి - రూ. 1.48 కోట్లు
* కృష్ణా - రూ. 73.8 లక్షలు
* గుంటురు - రూ. 86.75 లక్షలు
* నెల్లూరు - రూ.27.5 లక్షలు.