#Justice forJallikattu మహేష్ బాబు సపోర్ట్.... రానా కూడా....
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు jallikattuకి మద్దతు తెలిపాడు. తన ట్విట్టర్లో #JusticeforJallikattu అంటూ పోస్ట్ చేసిన మహేష్ ఇంకా ఇలా పేర్కొన్నాడు. తమిళనాడు సంప్రదాయం జల్లికట్టు కోసం ధైర్యంగా ముందుకు ఉరుకుతున్న యువతను చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని వెల
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు jallikattuకి మద్దతు తెలిపాడు. తన ట్విట్టర్లో #JusticeforJallikattu అంటూ పోస్ట్ చేసిన మహేష్ ఇంకా ఇలా పేర్కొన్నాడు. తమిళనాడు సంప్రదాయం జల్లికట్టు కోసం ధైర్యంగా ముందుకు ఉరుకుతున్న యువతను చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని వెల్లడించారు. అంతేకాదు.. అందరూ కలిసి జల్లికట్టు కోసం పోరాడుతున్న తీరు, తమిళనాడు విద్యార్థులంతా తమ లక్ష్యం కోసం పోరాడుతున్న వైనం అభినందనీయం అంటూ కొనియాడారు.
ప్రభుత్వాలు తమిళ ప్రజల సంప్రదాయల కోసం చేస్తున్న పోరాటంపై కదులుతుందని అనకుంటున్నా అని వెల్లడించారు. జల్లికట్టు గురించి మహేష్ బాబుతో పాటు బాహుబలి చిత్రం రానా కూడా మద్దతు తెలిపారు. ఇంకా పవన్ కళ్యాణ్ సైతం ఇప్పటికే తన మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే.